వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ లోకా?
posted on Sep 23, 2015 @ 4:11PM
వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన సొంత నియోజక వర్గమైన కడపజిల్లాలోని ఒక ఎమ్మెల్యే షాకివ్వనున్నారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. వైకాపాలోని ఒక ఎమ్మెల్యే టీడీపీ తీర్ధం పుచ్చుకోబుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ ఎమ్మెల్యే ఎవరనేది మాత్రం పేరు వినిపించడంలేదు. కానీ జిల్లాలో ఆయన కీలక ఎమ్మెల్యే అని.. ఆయన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే గతంలో వైకాపా పార్టీ ఇలాగే మైండ్ ఆడి టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కోనేందుకు ప్రయత్నాలు చేసిందని విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు టీడీపీ కూడా మైండ్ గేమ్ ఆడుతుందా.. ఈనేపథ్యంలోనే ఇలాంటి ప్రచారం జరుగుతుందా అని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.