జగన్ మోహన్‌రెడ్డి సీమాంధ్ర ముఖ్యమంత్రి అవడం ఖాయం : మేకపాటి జోస్యం
posted on Apr 21, 2014 @ 5:37PM
మామూలుగా అందరికీ చిలక జోస్యం గురించి తెలుసు. కానీ, మేక జోస్యం గురించి తెలుసా? తెలియదు కదూ? ఇంతకీ మేక జోస్యం అంటే ఏమిటంటే, వైఎస్సార్సీపీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పే జోస్యం. ఇంతకీ మేకపాటి చెప్పిన మేక జోస్యంలోని పాయింట్లు ఏమిటో చిత్తగించండి.
సీమాంధ్రకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు.
సీమాంధ్రలోని అన్ని పార్లమెంటు స్థానాలు, అసెంబ్లీ స్థానాలు జగన్ పార్టీ గెలుచుకుంటుంది.
తెలంగాణలో కూడా జగన్ పార్టీకి బోలెడన్ని అసెంబ్లీ స్థానాలు వస్తాయి.
తెలంగాణలో జగన్ పార్టీ మూడు పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటుంది. అవి మహబూబాబాబ్, ఖమ్మం, మల్కాజిగిరి.
కేంద్రంలో కూడా జగన్ చక్రం తిప్పబోతున్నాడు.