ఉరకలేస్తున్న ఉత్సాహం పేరు లోకేష్!
posted on Aug 2, 2022 @ 1:27PM
ఒకప్పుడు ఎంతో అనాసక్తంగా ఉండేవారు ఒక్కసారిగా ఏదో స్పూర్తి పొందినట్టు ఉత్సాహంతో ఉరకలు వేస్తుంటారు. అబ్బే ఇతనేమీ చేయలేడు, కేవలం వస్తూ పోతూండటమే అనే అభిప్రాయాలతో వెనక్కినట్టేయాలనుకున్న తరుణంలో ఒక్కసారిగా నూతనోత్సాహంతో, కొత్త శక్తితో అందరినీ ఆకట్టుకోవచ్చు. ఇలాంటి వారిని నిలువరించడం కష్టం. ఆ ఒరవడి, వేగం, ద్విగుణీకృత ఉత్సాహానికి ఇప్పటి రాజకీయాల్లో మారుపేరుగా నిలిచిన నేత నారా లోకేష్. అవును లోకేషే.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు కుమారుడు లోకేష్ చాలా కాలం నుంచి తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. పార్టీలో సాధారణ కార్యకర్తలా పనిచేస్తూనే అంచలంచలుగా ఎదిగి అందరి మన్ననలూ అందుకుని ఇపుడు కీలక నేతగా పరిణామం చెందిన యువ నాయకుడు లోకేష్.
తండ్రి రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న గొప్ప రాజకీయవేత్త. ఆయన కుమారుడిగా లోకేష్ ఎంతో నేర్చుకున్నారు. పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ప్రజాసేవలో తరిస్తోంది.
ఈ సమయం లో కూడా అధికారంలో ఉన్న పార్టీ నేతల కంటే మిన్నగా ప్రజల్లో మమేకమై యువతకు మార్గదర్శిగా మారారు లోకేష్. కాగా ఇటీవలి రాష్ట్ర రాజకీయ పరిణామాలు టీడీపీ మళ్లా అధికారంలోకి వచ్చే అవకాశాలకు వీలు కల్పించేవిధంగా ఉండటంతో పార్టీని గ్రామీణ స్థాయిలో బలోపేతం చేసుకుంటూ, అన్ని వర్గాలను కలుపుకుపోతూ అందరిలో తమ పార్టీ తమ సిద్ధాంతాలను, పార్టీ పట్ల వారి నమ్మకాన్ని, విశ్వాసాన్ని రెండింతలు పెంచే విధంగా వేగంగా, ఎంతో చురుగ్గా ముందడుగు వేయడం చూస్తూ అధికారపక్షం వారే విస్తుపోతున్నారు. అధికారంలోకి రాగానే ఎన్నో ఆశలుపెట్టి, మరెన్నోహామీలతో ప్రభుత్వం నడపాలనుకున్న వైసీపీ క్రమేపీ ప్రజాదారణ కోల్పోయిం ది. అధికార గర్వం అంధత్వాన్నివ్వడంతో విపక్షాన్ని అవమానించడం, శతృవులా చూడటం మాత్రమే తమ లక్ష్యంగా వ్యవహరించిన వైసీపీ ఇపుడు ప్రజాగ్రహాన్ని చవి చూస్తోంది. ఇక వచ్చే ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం కావడంలో భాగంగా లోకేష్ విస్తృతంగా రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై తమ పార్టీ ఎల్లపుడు అండగా ఉంటుందన్న నమ్మకం వారిలో కలిగిస్తున్నారు.
ముఖ్యంగా ఇటీవలి గోదారి వరదలతో రాష్ట్రంలో అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో బాధితు లను కలిసి వారికి ధైర్యం చెప్పి బతుకు మీద ఆశకల్పించడానికి చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రజలను కలిసి వారి బాధలు, ఆనందాలు,సంతోషాలు తెలుసుకోవడం సాయపడటానికి వెనుకాడకపోవడం ఎప్పుడూ ఉంది. అదే బాటలో ఆయన కుమారుడు లోకేష్ పయనిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలతో కలిసిపోతున్నారు. మీరు చూస్తున్న చిత్రంలో లోకేష్ చిన్నపిల్లాడిలా మారి ఆ పెద్దామెతో సెల్ఫీ దిగుతున్నారు. సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి ప్రజా నేతగా ఎదిగిన లోకేష్ కు జనం నీరాజనాలు పడుతున్నారు.