ఈ ఆహారాలను పెరుగుతో తింటే పాయిజన్ అవుతాయట..!

 

 

పెరుగు మన ఆరోగ్యానికి చాలా మంచిది. రుచిలో కూడా పెరుగు చాలా బాగుంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రతి ఇంట్లో పెరుగు నిల్వ ఉండేలా చూసుకుంటారు.  బయట మార్కెట్లో కూడా పెరుగు అమ్మకాలు,  మజ్జిగ అమ్మకాలు బాగా పెరుగుతాయి.  పెరుగును చిలికి రోజంతా కొద్ది కొద్దిగా మజ్జిగ రూపంలో తీసుకుంటూ ఉంటే అస్సలు వడదెబ్బ కొట్టదు.  వేసవి కారణంగా వేధించే వేడి దరి చేరదు.    కానీ పెరుగు  కొన్ని కారణాల వల్ల పెరుగు కూడా ఆరోగ్యానికి చేటు చేస్తుంది. కొన్ని ఆహార పదార్థాలతో  తినడం వల్ల  చాలా నష్టం చేకూరుస్తుంది.  కొన్ని పదార్థాలతో తింటే పెరుగు పాయిజన్ గా మారుతుందని ఆహార నిపుణులు అంటున్నారు.  ఇంతకీ  పెరుగుతో తినకూడని 4 ఆహారాలు ఏంటి? తెలుసుకుంటే..

సిట్రస్ పండ్లు

పుల్లని పండ్లను పెరుగుతో కలిపి తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా చెడ్డది. నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి పుల్లని పండ్లను పెరుగుతో ఎప్పుడూ తినకూడదు. పుల్లని పండ్లలో ఉండే ఆమ్ల గుణం పెరుగుతో కలిసి కలుపులో వాయువులు ఏర్పడటానికి దారి తీస్తుంది.  ఇది ఉబ్బరం,  గ్యాస్,  ఛాతీలో మంట వంటి సమస్యలకు కారణం అవుతుంది.

డెజర్ట్‌లు

స్వీట్లు తినడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు?  కానీ పెరుగుతో కలిపి స్వీట్లు తినడం కొందరికి సరదా.. మరికొందరికి ఇష్టం కూడా.  కానీ ఇలా పెరుగుతో స్వీట్లు తినడం ఆరోగ్యానికి హానికరం. పెరుగు,  స్వీట్ల  కలయిక  కడుపులో మంటను కలిగిస్తుంది.

బంగాళాదుంపలు..

పెరుగుతో బంగాళాదుంపలు తినడం  చూసే ఉంటారు.  చాలా రకాల స్నాక్స్ లో బంగాళాదుంపలతో చేసిన స్నాక్స్ పైన పెరుగును చాలా ధారగా వేసి మరీ ఇస్తుంటారు. కానీ పెరుగు,  బంగాళాదుంపల కలయిక ఆరోగ్యానికి చాలా చెడ్డదట. బంగాళాదుంపలను ఎక్కువగా తినడమే మంచిది కాదు.. ఇక పెరుగుతో తింటే అది ఇంకా నష్టం కలిగిస్తుంది

మాంసాహారం..

పెరుగుతో కలిపి మాంసాహారం తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే రెండింటిలోనూ ప్రోటీన్ ఉంటుంది.  ఇది మీ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. కానీ చాలామంది నాన్ వెజ్ వండేటప్పుడు మాంసాన్ని మసాలా మిశ్రమం లో నానబెడతారు.  ఈ మసాలాలో పెరుగు ఖచ్చితంగా వేస్తారు. అంతేకాదు.. నాన్ వెజ్ వంటకాలు తినేటప్పుడు అదనంగా పక్కనే పెరుగు కూడా ఉంటుంది. కానీ మాంసాహారం,  పెరుగు శరీరానికి ప్రోటీన్ పరంగా దెబ్బ కొడుతుంది.


                                     *రూపశ్రీ


గమనిక:


ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...