జిమ్ లేదా యోగ.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
posted on Jun 24, 2025 @ 9:30AM
జిమ్, యోగా రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వ్యాయామ పద్ధతులే. అయితే ఆరోగ్య లక్ష్యాలు , జీవనశైలి , శారీరక పరిస్థితి, మానసిక స్థితిని బట్టి ఏది బెస్ట్ అనే విషయంలో మార్పు ఉంటుంది. అంతేకాదు ఈ రెండింటి మధ్య తేడాలు ఉండటం వల్ల వీటి వల్ల లభించే ఫలితాల్లో కూడా తేడాలు ఉంటాయి. ఈ రెండు మధ్య తేడాలు, ఉపయోగాలు తెలుసుకుంటే..
జిమ్ (Gym) — లాభాలు:
బలవర్ధక వ్యాయామం (Strength training): జిమ్‌లో వెయిట్లు, మిషన్లు వాడడం వల్ల కండరాలు (muscles) బలంగా తయారవుతాయి.
శరీరాన్ని షేప్‌లోకి తేగలగడం (Body toning): శరీరంలో ఏదైనా ప్రాంతంలో కొవ్వు పేరుకుని ఉంటే.. ఆ ప్రాంతానికి సంబంధించి జిమ్ లో వ్యాయామాలు చేయడం ద్వారా కొవ్వు కరిగించి ఫిట్ బాడీని పొందవచ్చు.
వెయిట్ లాస్ / వెయిట్ గెయిన్ (Weight control): బరువు ఎక్కువ ఉన్నవారు మాత్రమే జిమ్ కు వెళతారు అంటే అది పొరపాటు. జిమ్ చేయడం వల్ల బరువు పెరగవచ్చు కూడా. దీనికి తగిన వ్యాయామాన్ని ఎంచుకోవచ్చు. ఫిట్‌నెస్ నిపుణులు కూడా సజెస్ట్ చేస్తారు. దీని వల్ల ఆరోగ్యకరంగా బరువు తగ్గడం, లేదా పెరగడం చేయవచ్చు.
ఎనర్జీ స్థాయి పెరుగుతుంది: జిమ్ కు వెళ్లడం వల్ల శరీరం చురుగ్గా మారుతుంది. దీనివల్ల రోజువారీ జీవితం energetic గా ఉంటుంది.
కార్డియో ఎక్సర్సైజులు (Cardio workouts): కార్డియో ఎక్సర్సైజులు గుండెకు చాలా మంచివి. జిమ్ లో చాలామంది చేసే ట్రెడ్‌మిల్, సైక్లింగ్ వంటివి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుండెను దృఢంగా మారుస్తాయి.
యోగా (Yoga) — లాభాలు:
మానసిక ప్రశాంతత (Mental peace): యోగా అంటే కేవలం శరీరానికి సంబంధించినది కాదు.. ఇది మనసుకు కూడా సంబంధించినది. కాబట్టి యోగా వల్ల మైండ్‌ఫుల్‌నెస్, మెడిటేషన్ ద్వారా ఒత్తిడి తగ్గుతుంది.
శ్వాస, చైతన్యం పెరుగుతుంది (Improved breathing & awareness): యోగాలో ధ్యానం, ప్రాణాయామం ముఖ్యమైనవి. ప్రాణాయామంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇవి lungs పనితీరును మెరుగుపరుస్తాయి.
శరీర సౌలభ్యం (Flexibility): యోగాలో వివిధ ఆసనాలు, భంగిమలు ఉంటాయి. వీటి వల్ల శరీరంలో అన్ని ప్రాంతాలలోసాధారణంగా అందరూ చేసే వ్యాయామాలకంటే ఎక్కువగా బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది.
హార్మోనల్ బ్యాలెన్స్: యోగా వల్ల శరీరంలో గ్రంథుల పనితీరు మెరుగవుతుంది. దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గి హార్మోన్లు సక్రమంగా విడుదల అవుతాయి. ఇది శరీర వ్యవస్థలను సవ్యంగా ఉంచుతుంది. ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ, నాడీవ్యవస్థ మొదలైన వాటికి మేలు చేస్తుంది.
ఎవరికి ఏది బెటర్?
వ్యక్తి లక్ష్యాన్ని బట్టి సరైన ఎంపిక.. దానికి గల కారణం..
బరువు తగ్గాలనుకునే వారు జిమ్ లేదా యోగా + డైట్ చేయడం మంచిది. అయితే జిమ్ వేగంగా ఫలితం ఇస్తుంది. యోగా మెల్లగా ఫలితాన్ని ఇస్తుంది. కానీ దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుంది.
మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి అనుకునేవారు యోగా మెడిటేషన్, ప్రాణాయామం చేయాలి. ఇవి మానసిక శాంతిని ఇస్తాయి.
కండరాలు పెంచుకోవాలి అనుకునేవారికి జిమ్ బెటర్. ఎందుకంటే జిమ్ లో వెయిట్ ట్రైనింగ్ ఉంటుంది. ఇది కండరాలు పెరగడానికి అవసరం.
ఫ్లెక్సిబిలిటీ, అంతర్గత ఆరోగ్యం కోసం యోగా చేయాలి. నాడీవ్యూహం, శ్వాస వ్యవస్థ పైన యోగా ప్రభావితంగా ఉంటుంది. అందుకే యోగాఎంపిక మేలు.
టైమ్ తక్కువగా ఉంటే జిమ్ కు వెళ్లడం కుదరదు. కాబట్టి అలాంటి వారికి యోగా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే యోగాను ఇంట్లో కూడా 20-30 నిమిషాలు చేయవచ్చు.
మోటివేషన్ తగ్గిపోతుంటే ఇంట్లో జిమ్ అయినా, యోగా అయినా చేయలేం. అందుకే జిమ్ లో ట్రైనర్, యోగా క్లాసులలో యోగా టీచర్ ఇంకా ఇతర అభ్యాసకులు ఉంటారు. కాబట్టి ఉత్సాహంగా ముందుకు వెళ్లవచ్చు.
మిక్స్ చేయడం బెస్ట్..
అవకాశం ఉంటే వారంలో 3 రోజులు జిమ్ + 2 రోజులు యోగా చేయడం ఉత్తమ మార్గం. ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ, మైండ్ బ్యాలన్సు అన్నీ కలుగుతాయి.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...