వైసీపీ శాడిజానికి ఇది పరాకాష్ట.. రఘురామకృష్ణంరాజు
posted on Aug 3, 2022 @ 4:17PM
ఎవరయినా ఒక వ్యక్తి మరణించగానే శతృవులయినా కాస్తంత సానుభూతితో వెళ్లి ఆ కుటుంబాన్ని పలకరి స్తారు. కానీ వైసీపీవారు మాత్రం చావు పరామర్శకు వెళ్లి చచ్చినోడికి మెల్లకన్ను అన్నట్లు వ్యవహరించారు. అసంబద్ధ, అవాస్తవ విమర్శలతో అభాసుపాలయ్యారు. తమ విమర్శలన్నీ అవాస్తవాలని తేలిపోయిన తరువాత కూడా క్షమాపణలు చెప్పకపోగా అదే మూర్ఖత్వాన్ని కొనసాగిస్తూ ఉండిపోవడాన్ని వైసీపీ శ్రేణులో సహించలేకపోతున్నాయి. సొంత పార్టీ రెబల్ ఎంపీ రఘురామ రాజు కూడా ఈ విషయాన్నే ఎత్తి చూపుతూ మా పార్టీ శాడిజానికి ఇది పరాకాష్ట అని వ్యాఖ్యానించారు.
ఆస్తికోసమే గొడవపడి కుటుంబసభ్యలే ఆమె మరణానికి కారకులయ్యారని వైసీపీ సోషల్ మీడియా ప్రచా రం చేయడం క్షమించరాని నేరమని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెర వేలుపుగా తెలుగువారు పూజించే ఎన్టీ రామారావు కుమార్తె మరణం పట్ల వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారం నైతిక దివాళాకోరుతనానికి నిలువెత్తు నిదర్శనంగా అభివర్ణించారు. ఆస్తికోసం అర్రులు చాచడం, అన్నా చెల్లెళ్లు బంధాన్ని కూడా పట్టించుకోకుండా దూరంగా వెళ్లడం ఎవరు చేశారన్నది యావత్ తెలుగు ప్రజలందరికీ తెలుసునని రఘురామ రాజు అన్నారు. కానీ ఎన్టీఆర్ కుటుంబానికి ఆ అగత్యం లేదని రఘురామ రాజు అన్నారు.
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో రఘురామ కృష్ణంరాజు మీడియాతో మాట్లాడారు. తమ పార్టీకి వచ్చే ఎన్నికలలో 40 నుంచీ 45 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుందని భావించాననీ, ఇప్పుడు మా పార్టీ సోషల్ మీడియాలో పార్టీ వారియర్స్ చేస్తున్న ఈ వికృత చేష్టలతో ఒక్క సీటు రాకపోయినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పని లేదని రఘురామరాజు అన్నారు. అసలు ఒకరి బంధువు మరణాన్ని రాజకీయ కోణంలో చూడడం కామెంట్లు చేయడం కంటే దారు ణం మరోటి ఉండదని వైసీపీ ఎంపీ మండిపడ్డారు. హూ కిల్డ్ బాబాయ్ అన్నదానికి ప్రతిగా హూ కిల్డ్ పిన్ని అనే ప్రచారానికి తెర లేపడం పై ఆయన మండిపడ్డారు. బాబాయి హత్య కేసులో నిందితులను బయటకు రాకుండా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నదెవరన్నది తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ అర్థమైపోయిందన్నారు. ఏకంగా సిబిఐ అధికారి రాంసింగ్ పైనే, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి చేత ఫిర్యాదు చేయించి కేసు పెట్టించిందెవరో తెలియదా అని ప్రశ్నించారు. సీబీఐ అధికారి రామ్ సింగ్ తనపై పెట్టిన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ను స్క్వాష్ చేయమని కోరగా, కోర్టులో కేసు లిస్ట్ కాలేదని, జడ్జి సెలవు పెట్టి వెళ్లారని, ఇలా ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే ఒళ్ళు జలదరిస్తుందని అన్నారు. ఇక రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యవహరించిన తీరు లేపి తన్నించుకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.
ఏపీ డెవలప్మెంట్ కార్పొ రేషన్ పేరిట తాము చేసిన అప్పులను, ఆర్.బి.ఐ తప్పు పట్టినట్టుగా లేఖ రాసిందా ?అంటూ ప్రశ్నించి రాజ్యసభ సాక్షిగా ఏపీ సర్కార్ అప్పులను ఆర్బీఐ తప్పుపట్టిందని కేంద్రం ప్రకటించడంతో మోహం ఎక్కడ దాచుకోవాలో తెలియని పరిస్థితిలో పడ్డారని రఘురామకృష్ణం రాజు అన్నారు.
పార్లమెంట్లో 377 లో భాగంగా లాటరీ లో తనకు ప్రశ్న లేవనెత్తి అవకాశం లభించిందని, అయితే తమ పార్టీ ఎంపీలు కేంద్రానికి సంబంధించిన అంశాన్ని మాత్రమే మాట్లాడాలి తప్ప, రాష్ట్రానికి సంబంధించిన అంశాన్ని మాట్లాడవద్దు అంటూ ఒత్తిడిని తీసుకువచ్చి, ప్రజా సమస్యను ప్రస్తావించకుండా చేశారని రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లినే గౌరవించని వాడు .మాతృభాషను గౌరవిస్తాడను కోవడం తప్పేనని అన్నారు.
ప్రాథమిక విద్య మాతృభాషలోనే బోధించాలని ఎం ఓ ఎస్ అన్నపూర్ణాదేవి స్పష్టంగా పేర్కొన్నారని, దేశంలోని 28 భాషలలో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడించా రని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు విద్యార్థులు, వారి తల్లిదం డ్రులు పాఠ శాలల కోసం రోడ్డు ఎక్కారని గుర్తు చేశారు. పాఠశాలలు దూరంగా ఉండటం వల్లే దాదాపు 11 లక్షల మంది విద్యార్థులు దగ్గర్లో ఉన్న ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నారని, వీరిలో అత్యధిక శాతం ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన వారేనని గుర్తు చేశారు.