జగన్ అరుణ్ జైట్లీని కలిశారు.. ఎందుకంటే...
posted on Jul 11, 2014 @ 5:45PM
వైసీపీ నేత జగన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని అరుణ్ జైట్లీని కలిశారు. ఈ సందర్భంగా జగన్ అఅరుణ్ జైట్లీకి చేసిన విజ్ఞప్తులు ఇలా వున్నాయి. 1. ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ను పదిహేనేళ్ల పాటు ఇవ్వాలి. 2. ఆంద్రప్రదేశ్ ఆర్దికంగా లోటు బడ్జెట్ లో ఉన్నందున కేంద్రం సాయం చేయాలి. 3. విభజన బిల్లులో పేర్కొన్నట్లుగా రాష్ట్రానికి నిట్, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, సెంట్రల్ యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీ, గిరిజన విశ్వవిద్యాలయం, జాతీయ విపత్తుల నిర్వహణ విశ్వవిద్యాలయాన్ని తొందరగా ఏర్పాటు చేయాలి. 4. 13వ షెడ్యూల్‌లో పేర్కొన్నట్లుగా కడపలో స్టీల్ ప్లాంట్, విశాఖలో పెట్రోలియం కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలి. 5. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేయాలి. 6. విశాఖలో మెట్రో రైల్, విజయవాడ-తెనాలి-గుంటూరులలో మెట్రోపాలిటిన్ అర్బన్ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలి.