జగన్ మౌనం వెనుక కారణం ఉందా?
posted on Dec 7, 2015 @ 4:29PM
ప్రతి పక్షనేత అంటే ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. అధికార పార్టీని విమర్శించడానికి ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా.. ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి వారిని విమర్శించాలా అని ఆలోచిస్తుంటారు. కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి ఎక్కడ కనిపించడంలేదని స్పష్టంగా అర్ధమవుతోంది. ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఆమధ్యలో ధర్నాలు, ఆందోళనలు అంటూ కొంచెం హడావుడి చేసినా ఇప్పుడు మాత్రం అలాంటి ఛాయలు ఎక్కడా కనిపించడంలేదు. తన పాటికి తాను సైలెంట్ గా పనులు చూసుకుంటారు. దీంతో పార్టీ నేతలకు జగన్ ఎక్కడంటూ వెతుక్కునే పరిస్థితి వచ్చింది. అంతేకాదు ఆయన వైఖరిపై పార్టీ నేతలే కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక పక్క టీడీపీ ప్రజల్లో తమ పార్టీని బలోపేతం చేసుకుంటుంటే మరో పక్క జగన్ మాత్రం తనకేమి పట్టనట్టు తన బిజెనెస్ పనుల్లో మునిగిపోతున్నారని.. ఇది పార్టీకే మంచిది కాదని అనుకుంటున్నారు. ప్రజా సమస్యలపై ఇప్పటివరకూ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు..అంతేకాదు జగన్ తరుపున బొత్స లాంటి పెద్దలు ప్రెస్ మీట్ లు పెడుతున్నా.. టీడీపీ నేతలు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదట. జగన్ విమర్శిస్తే అప్పుడు చూసుకోవచ్చులే.. ఇప్పుడు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం ఏందుకని భావిస్తున్నారట. ఇదిలా ఉండగా జగన్ మాత్రం.. ప్రతిపక్షంగా ఎంత పోరాడినా వేస్ట్ అని.. ఏం చేసినా చంద్రబాబుదే పై చేయిగా నిలుస్తుందని చెప్పి.. ప్రస్తుతానికి మౌన మంత్రాన్ని అనుసరిస్తున్నారట. మరి జగన్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారో.. ఆయన సైలెంట్ వెనుక ఏదైనా కారణం ఉందా?.. సరైన టైం కోసం ఎదురుచూస్తున్నారా?.. వీటన్నింటికి సమాధానం దొరకాలంటే వైయిట్ చేయాల్సిందే.