Read more!

ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ దూరం చేసే కుట్ర!

ప్రజల అభిమానాన్ని పొంది ఎన్నికలలో విజయం అందుకోవడం అసాధ్యమన్న నిర్ణయానికి వచ్చేసిన ఏపీలోని అధికార వైసీపీ ఇప్పుడు తమను వ్యతిరేకించే వారు ఓటు వేయడానికి అవకాశం లేకుండా చేసి లబ్ధి పొందాలని చూస్తోంది. ప్రజలు, వ్యాపారులు, కార్మికులు, కర్షకులు, మధ్య తరగతి ఇలా సమాజంలోని ఏ వర్గమూ జగన్ పాలన పట్ల సదభిప్రాయంతో లేదు.  ప్రజలను కష్టాల పాల్జేసి, వ్యతిరేకించిన వారిని నానారకాలుగా వేధించి ఈ ఐదేళ్ల పాలనలో జగన్ రాష్ట్ర ప్రగతిని అడుగంటించేశారన్న ఆగ్రహం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే వారినీ అన్ని రకాలుగా వేధించారు. వేతనాలు సమయానికి ఇవ్వకపోవడమే కాదు, డీఏ బకాయిలు, ఫిట్ మెంట్ విషయంలో కూడా వారిని దారుణంగా దగా చేశారు. కొందరు ఉద్యోగ సంఘాల నేతలను లోబరచుకుని ఉద్యోగులను వారికి న్యాయంగా రావలసిన ప్రయోజనాలకు కూడా దూరం చేశారు. 

దీంతో ఉద్యోగులంతా ఈ సారి వైసీపీకి గుణపాఠం చెప్పాలన్న నిర్ణయానికి వచ్చేశారు. ఆ విషయంలో వారేమీ రహస్యాన్ని పాటించడం లేదు. ఆ విషయాన్ని బాహాటంగానే చెబుతున్నారు. ఈ నేఫథ్యంలో ఉద్యోగులు ఓట్లు ఎటూ ప్రభుత్వానికి వ్యతిరేకమే అన్న నిర్ణయానికి వచ్చి వారి ఓటు హక్కును హరించడమే లక్ష్యంగా జగన్, వైసీపీ కుట్రలకు తెరలేపారు. 

ప్రభుత్వ ఉద్యోగులంతా జగన్ ప్రభుత్వంపై తీవ్ర అసహనంతో ఉన్నారు.  తెలుగుదేశంకు  ఓట్లు వేస్తారనే భయంతో పోస్టల్ బ్యాలెట్ ను తగ్గించేందుకు, కొందరు అధికారులతో చేతులు కలిపి వైసీపీ కుట్రలకు తెరలేపింది.  జగన్ రెడ్డి అడుగులకు మడుగులొత్తుతున్న  కొంత మంది అధికారులతో  ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు కాకుండా కుట్ర చేశారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు లేవంటూ  ఫారం12 లను తీసుకోవడం లేదని చెబుతున్నారు. ఉద్యోగులు పట్టుబట్టడంతో వాటిని తీసుకున్నా.. తీసుకున్నట్లుగా రశీదు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.  ఇప్పటికీ నోడల్ ఆఫీస ఎవరన్నది స్పష్టత లేదని చెబుతున్నారు. తక్షణమే  నోడల్ అధికారులను నియమించి, నోడల్ ఆఫీసర్ ఎవరో కింది స్థాయి అధికారులకు తెలిసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ ఉద్యోగుల ఓట్లపై కుట్ర చేస్తుందని తెలుగుదేశం ఎమ్మెల్సీ పరుచూరు అశోక్ బాబు  ఆరోపించారు.   ఎన్నికల విధుల్లో భాగంగా ఉద్యోగ రిత్యా అధికారులు ఎవరైనా నియోజకవర్గంలో ఉన్నా ఫారం 12 కాపీలను తీసుకోవాల్సిన బాధ్యత ఏఆర్వో, ఆర్వోలపై ఉందన్నారు.  ఉద్యోగస్తులకు అన్యాయం చేసిన  జగన్ ప్రభుత్వానికి  ప్రభుత్వ ఉద్యోగులంతా ఓటు రూపంలో బుద్ధి చెప్పాలనీ అశోక్ బాబు పిలుపునిచ్చారు.  ఉద్యోలకు మేలు చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని  కోరారు.