Read more!

ఒలింపిక్స్‌ నుంచి రెజ్లింగ్‌ అవుట్

 

 

 

 

ఇండియాకు ఐఓసీ షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 2020 ఒలింపిక్స్‌ నుంచి రెజ్లింగ్‌ను తప్పించింది. ఈ మేరకు ఐఓసీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు తన నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే క్రీడల్లో మార్పులు చేర్పులు లో భాగంగానే ఈ నిర్ణయంతీసుకున్నట్టు ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం భారత్ పతకాలపై ప్రభావం పడుతోంది. 2008, 2012 ఒలింపిక్స్ లో భారత్ ఈ అంశంలో పతకాలు సాధించింది.

 

అంతే కాదు 1962లో భారత్ కు వ్యక్తిగత విభాగంలో వచ్చిన పతాకం కూడా రెజ్లింగ్ లో వచ్చిందే! అలాంటి రెజ్లింగ్ ఇంకో ఒలింపిక్స్ లో మాత్రమే కనిపిస్తుంది. బ్రెజిల్ లో జరిగే తర్వాతి ఒలింపిక్స్ లో మాత్రమే రెజ్లింగ్ ఆఖరు! ఆ తర్వాత మనకు అంతో ఇంతో మెడల్స్ తెచ్చి పెట్టే క్రీడ మాయం అవుతోంది. ఇదిలా ఉంటే… ఒలింపిక్స్ నుంచి రెజ్లింగ్ తొలగించటంపై దేశ వ్యాప్తంగా ఉన్న వస్తాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత లండన్ ఒలింపిక్స్‌లో ఇండియా రెండు మెడల్స్ సాధించిన పెట్టిన రెజ్లింగ్‌పై చిన్న చూపుతగదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2020 ఒలింపిక్స్ నుంచి తొలగించాలని ఐఓసీ ఎందుకు నిర్ణయం తీసుకుందో అర్థం కావడం లేదని అంటున్నారు. భారత ప్రభుత్వ జోక్యం చేసుకుని రెజ్లింగ్ కొనసాగేలా ఒత్తిడి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.