అమ్మో.. ఎంత పెద్ద స్వ్కిడ్!
posted on Sep 13, 2022 @ 11:59AM
సముద్రం ఒడ్డున రంగురంగుల పెద్ద గవ్వలో, మరేదయినా వింత వస్తువో కనపడగానే బేస్తవాళ్ల దగ్గర నుంచి అక్కడకి పరుగున వచ్చిన పోలీసులు భయపడి చూడ్డం చాలాకాలం నుంచి వింటున్న కథల్లో భాగం. ఏదయినా పడవ భాగమో, పెద్ద రాయో ఒక్కోసారి కొట్టుకువస్తాయి. దాన్నీ వింతగా దూరం నుంచే చూసి ఆనక దగ్గరకెళ్లి ..ఇదేనా భయపడి చచ్చాంగా.. అనుకుంటారు. కానీ ఈ మధ్యనే న్యూజిలాండ్ గోల్డె న్ బే లో హఠాత్తుగా పర్యాటకులు ఒక పెద్ద జంతు కళేబరం లాంటిది చూసి ఖంగారుపడ్డారు. కేకలు వేశా రు. చాలామంది గుమిగూడారు. కాస్తంత దూరం నుంచే దాన్ని చూస్తుండిపోయారు. అది అతిపెద్ద సముద్ర స్వ్కిడ్. ఇదేదో భూతంలా ఉందని పర్యాట కులు భయపడి గోల చేశారు.
కొంతసేపటికి అక్కడికి చేరుకున్న సముద్రజీవుల సంబంధిత శాస్త్రవేత్త ఒకాయన అది సముద్ర స్క్విడ్ అనీ అది చచ్చిందని భయపడాల్సిందేమీ లేదని ధైర్యం చెప్పాడు. మరో చిత్రమేమంటే ఇలాంటి అతిపెద్ద సముద్రజీవి ఇలా తీరంలోకి వచ్చి పడటం చాలా చాలా అరుదుగా జరుగుతుందని ఆయన చెప్పారు. అన్నట్టు ఇది ఏకంగా 13 అడుగుల పొడవు, 10 అంగుళాల వెడల్పూ ఉంది.
పెద్ద పెద్ద కళ్లు, పొడవాటి తోకల్లాంటి కాళ్లతో ఉంది. సైంటిస్టు ఇచ్చిన ధైర్యంతో అది ఖచ్చితంగా చచ్చింద ని నిర్ధారించుకున్న తర్వా త పిల్లలు పెద్దలు ఏకంగా సెల్ఫీలు తీసుకుని ఆనందించారు. పోలీసులు, అక్కడున్నపెద్దలు ఏమీ అనలేదు. కారణం ఇలాంటివి మళ్లీ చాలాకాలానికి గాని చూడ లేమని. ఇది నిజంగానే సముద్ర విచిత్రంగా చెప్పు కున్నారంతా. దాని కడుపు భాగం చీలి ఉంది. అందులో పెద్ద పెద్ద చేపలు సగం సగం తెగి ఉన్నా యి. బహుశా ఈ సముద్రజీవి చనిపోయిన తర్వాత చాలా రోజులుగా కెరటాల మీద తేలుతూ న్యూజిలాండ్ గోల్డెన్ బే బీచ్‌కి వచ్చి పడి ఉంటుందని శాస్త్ర వేత్తలు అన్నారు.