కిడ్నీ సమస్యలతో జీవించడం అసాధ్యమా ?
posted on Mar 13, 2021 @ 9:30AM
సాధ్యమా అన్న సందేహం కిడ్నీ రోగులను వేదిస్తోన్న ప్రశ్న ? అయితే ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నిజాం ఇన్స్టిట్యూట్ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి చెందిన ప్రొఫెసర్, హెచ్ ఓ డి డిపార్ట్ మెంట్ అఫ్ నేఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు వన్ హెల్త్ తో మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న నేఫ్రాలజిస్ట్లులు సమావేశాలు అవగాహన సదస్సులు నిర్వహిస్తారని తెలిపారు. కిడ్నీ ఫేయిల్యూర్ తరువాత చాలా మంది రోగులు ఇక జీవించడం ఎందుకని అసంతృప్తి నిరుత్సాహంతో ఉంటారు. కిడ్నీ సమస్య ఒకప్పుడు మరణసశానమే అని అన్నారు. అయితే కిడ్నీ సమస్య ఉన్నవారు జీవించడం సాధ్యమే అని, రోగులకు భరోసా కల్పించారు.డాక్టర్ శ్రీభూషణ్ రాజు 40 - 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ సమస్యతో బాధపడుతున్నారు అని ఆయన వన్ హెల్త్ చానల్ కు వివరించారు. అయితే డయాలసిస్ తో అందరూ బాగుపడవచ్చని ఆయన అన్నారు. డయాలసిస్ తరువాత తిగి వెనక్కు చూడలేదని అన్నారు. డయాలసిస్ చేసుకుని సాధారణ జీవితం గడుపుతున్న లక్షలాది మంది ఇప్పటికీ జీవిస్తున్నారని శ్రీభూషణ్ రాజు అన్నారు. కిడ్నీ ఫేయిల్యూర్ వస్తే చింతించాల్సిన అవసరం లేదని 30 ఏళ్లుగా డయాలసిస్ చేసుకుంటున్నవారు ఉన్నారని అన్నారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యలు,లివర్ పాడైతే తీవ్ర ఇబ్బందులు తప్పవని ఇలాంటి మల్టిపుల్ సమస్యలు ఉంటే కిడ్నీ ని సహజంగా డయాలసిస్ చేసిన కొన్నిసార్లు కష్టమౌతుందని అన్నారు.కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయిన వాళ్ళు 100 % పాడైపోయిన వారే ఎక్కువగా వస్తు ఉంటారని శ్రీభూషణ్ రాజు అన్నారు. డయాలసిస్ అనగానే భయపడేవారు ఎక్కువ అని వివరించారు. కిడ్నీ పాడైతే డయాలసిస్స్ నా?అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ కొంత మందికి తీవ్రతను బట్టి తక్కువ రోజులు లేదా కిడ్నీ డ్యామేజ్ తో పాటు ఇన్ఫెక్షన్ లేదా చీము వచ్చిన వారికీ పూర్తిగా కోలుకునే వరకు చికిత్స ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. కొంత మంది వ్యాధి తీవ్రతను గుర్తించకుండా తాము ఎక్కువ రోజులు అసుపత్రిలో ఉండలేమని ఇంటికి వెళ్లిపోతామని ఒత్తిడి చేస్తారు. అలాంటాప్పుడు కుటుంబ సభ్యులు స్నేహితులు వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేయాలనీ అన్నారు. కిడ్నీ వంద శాతం పాడైనా ఇప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతికత వల్ల పరీక్షలు చేయించుకుంటూ ముందుగానే కనుక్కుని జాగ్రత్తలు పాటిస్తూ జీవితాన్ని మలుపు తిప్పిన ఘటనలు చూసామని వన్ హెల్త్ కు చెప్పారు. కిడ్నీ పాడైతే శరీరం పాడై పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కిడ్నీ పాడైతే బిపి పెరుగుతుందని,దీర్ఘకాలికంగా కిడ్నీ పాడై కండరాలు పాడై పోతాయని అయితే దీర్ఘకాలంగా మందులు వాడితే జీవించగలమన్న ఆశ పెరుగుతోందని శ్రీ భూషణ్ రాజు అన్నారు. క్రానిక్ కిడ్నీ సమస్యలతో బాధపడేవారు రెండు పద్దతులలో డయాలసిస్ చేసుకోవచ్చని అన్నారు. ఒకటి కడుపులో వేసుకునేది. ఇంట్లోనే డాయలసిస్ చేసుకోవచ్చు. కిడ్నీ డయాలసిస్ చేసుకుంటేనే ఆనందంగా జీవిస్తున్నారని ఆయన అన్నారు.
రక్త హీనతతో ఉండడం వల్ల నీరసంగా ఆయాసం గా ఉంటారని అన్నారు. బిపి వల్ల కిడ్నీ సమస్య ముదరకుండా చూడవచ్చు అని విశ్లేషించారు. దీనికి త్వరగా మందులు వేసుకుంటే బయటపడవచ్చునని సూచించారు..రెట్రోహార్మోన్ వల్ల మామూలుగానే జీవించవచ్చని తెలిపారు. ఫాస్ట్ ఫుడ్ వల్ల కిడ్నీపాడైపోతుందని ఈవిషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సాత్విక ఆహరం తీసుకోవాలని సూచించారు.. ఇక డయాలసిస్ తో కిడ్నీమెరుగు కాకుంటే కిడ్నీ ఫెయిల్ అయితే నిరుత్సహపడవదని కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే లక్షలాది మంది కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేశాక ఆనందంగా జీవిస్తున్నారని అన్నారు. సరైన సమయంలో సరైన చికిత్సమందులు డాక్టర్ సూచన పాటిస్తే కిడ్నీ వ్యాదుల నుండి బయటపడి ఆనందంగా జీవించవచని. అది సాధ్యమే అని డాక్టర్ శ్రీభూషణ్ రాజు విశ్వాసం కల్పించారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం రోజున మన మందరం కిడ్నీ రోగులకు వారు తిరిగికోలుకునే విధంగా వారికి అవగాహన కల్పించి ఆరోగ్యంగా ఉండేవిధంగా చూడాల్సిన బాధ్యత మనదే అని అన్నారు.