కిడ్నీలను కాపాడుకోండి

 

 

(ఈరోజు వరల్డ్ కిడ్నీ డే)

మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయగలడు, ఏదైనా సాధించగలడు. మనం తినే ఆహారం మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన శరీరంలో ప్రతి అవయవం మనకు అవసరమైనదే. అవి చక్కగా పని చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఈరోజు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా కిడ్నీల గురించి మాట్లాడుకుందాం. ఇవి మన శరీరంలో చాలా ముఖ్యమైనవి. మనం చేసే అశ్రద్ధ వల్ల ఈ కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. కొందరికి మూత్రానికి వెళ్తె మంట, మరికొందరికి మూత్రపిండాలలో ఇబ్బందులు వస్తుంటాయి. ఇలాంటి సమస్యలు వచ్చాయంటే దానికి కారణం మీకు మూత్రపిండాలలో సమస్య మొదలైంది అని అర్ధం. కనుక మన మూత్రపిండాలు ఆరోగ్యంగా, మంచిగా పని చేయాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. అవేంటో చూద్దాం

1. శరీరానికి నీరు చాలా అవసరం. ఇది మీ శరీరాన్ని శుభ్రపరచడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. కనుక తగినన్ని ధ్రవాలు తీసుకోవడం మంచిది. నీరు కిడ్నీలను శుభ్రంగానూ, ఆరోగ్యంగానూ ఉంచుతుంది.

2. ముఖ్యంగా రోజులో ఎక్కువసార్లు మూత్రం పోయడం అలవాటు చేసుకోవాలి. ఇది కిడ్నీల ఆరోగ్యానికి చాలా మంచిది. కొంతమంది చాలాసేపు మూత్రాన్ని ఆపుకొంటారు. ఇది చెడు అలవాటు. ఇది మీ కిడ్నీలపై ఒత్తిడి కలిగిస్తుంది.

3. సిట్రస్ జాతికి చెందిన బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ, క్రాన్ బెర్రీలు అధిక ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. అవి కిడ్నీ సమస్యలను తొలగిస్తాయి.

4. ఎక్కువ మసాలా, కారం మీ లివర్, కిడ్నీలపై చెడు ప్రభావం చూపుతాయి. కనుక మీ ఆహారంలో తగుమాత్రం కారాలు ఉండేలా చూసుకోండి.

5. కొత్తిమీర కిడ్నీలను శుభ్రపరచడంలో సహకరిస్తుంది. కోరియండర్, పార్సిలీ, సిలాన్త్రోలు ఒకే జాతికి చెందినవి. ఇవి కిడ్నీల ఫిల్టర్ లను శుభ్ర పరుస్తాయి.

6. డయాబెటిస్ ఉన్నట్లయితే కిడ్నీలు వేగంగా చెడిపోతాయి. అందుకే డయాబెడిస్ ఉన్నవారు దానిని అదుపు చేసుకుంటే మంచిది.

7. కొన్ని సింపుల్ స్ట్రెచింగ్ వ్యాయామాలు, యోగాలోని కొన్ని భంగిమలు కిడ్నీలు సవ్యంగా పని చేసేలా చేస్తాయి.

8. అధికంగా పని చేయడం వల్ల కూడా కిడ్నీలు అలసిపోతాయి. కనుక ప్రతి రోజు 8 గంటల పాటు తప్పక నిద్రపోవాలి.

9. అధిక ఒత్తిడికి గురవడం కూడా కిడ్నీలు పాడవడానికి ఒక కారణం. కనుక రిలాక్స్ అయి ఒత్తిడికి దూరంగా ఉండి కిడ్నీలు బాగా పనిచేసేలా చూసుకోండి.

10. అరుగుల అనేది ఒక పచ్చని ఆకు కూర అది మీ కిడ్నీల లోని టాక్సిన్ లను బయటకు పంపుతుంది. అరుగుల కనుక రెగ్యులర్ గా తింటే కిడ్నీ సమస్యలతో బాధలు పడే వారికి మంచి రిలీఫ్ కలుగుతుంది.