తెలంగాణ 13వ ర్యాంకు.. అందుకేనట
posted on Sep 19, 2015 @ 5:06PM
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనువైన ప్రాంతాల్లో ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నివేదికలో ఏపీ రాష్ట్రానికి 2 స్థానం.. తెలంగాణ రాష్ట్రానికి 13వ స్ఠానం దక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ నివేదిక రాకముందునుండి పెట్టుబడులు పెట్టడానికి గాను.. పరిశ్రమల స్థాపనకు గాను అనువైన వాతావరణం కలిగి ఉన్న ప్రాంతాల్లో ఏపీ కంటే తెలంగాణ రాష్ట్రమే అనువైనదని భావించారు. కాని ప్రపంచ బ్యాంకు తెలిపిన దానిని బట్టి సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది. అయితే ఇప్పుడు తెలంగాణకు 13వ ర్యాంకు రావడంపై పలు కథనాలు వెలువడుతున్నాయి. తెలంగాణ నేతలైతే ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. వెంకయ్యనాయుడులు కలిసి మేనేజ్ చేసి ఈ ర్యాంకు తెప్పించారని అన్నారు. అయితే దీనికి కారణం వేరే ఉంది అంటున్నారు అధికార నేతలు. రాష్ట్ర ర్యాంకింగ్లకు సంబంధించి వరల్డ్ బ్యాంకు తోపాటు మేక్-ఇండియా, కేఎంజీ, సీఐఐ లాంటి తదితర సంస్థలు రాష్ట్ర పరిస్థితి గురించి అడుగుతూ అందరితో పాటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా లేఖలు రాశారంట. కానీ తెలంగాణ ప్రభుత్వం నాయకులు ఆసమయంలో మొద్దునిద్రలో ఉండి వాటికి స్పందించలేదు. దురదృష్టమేంటంటే అదే టైమ్ కి కేసీఆర్ కూడా ఇక్కడ విదేశీ పర్యటనలో ఉండి ఇక్కడ లేకుండా ఉండటం మొత్తానికి రాష్ట్రానికి అనూహ్యరీతిలో ఆ ర్యాంకు వచ్చిందని అంటున్నారు. మొత్తానికి కారణమేదైతే కాని ఈ ర్యాంకు విషయంలో మాత్రం ఏపీ ముందుండగా.. తెలంగాణ మాత్రం వెనుకంజలో ఉంది.
ఇదిలా ఉండగా తెలంగాణ నేతలు చేసిన పనిని పక్కనపెట్టి.. ఏపీ ర్యాంకు విషయంలో చంద్రబాబు మేనేజ్ చేశారు అని విమర్శించడం వారికే చెల్లింది.