నారాయణఖేడ్ ప్రాంతంలోని తండాలో అసలు ఏమి జరుగుతోంది?
posted on Oct 31, 2019 @ 2:29PM
పద్దెనిమిదేళ్లు దాటిన ప్రతి అమ్మాయి రాత్రికి రాత్రే తల్లితండ్రులతో సహా మాయం అవ్వటం అనేది ఎవ్వరూ ఊహించని అనాగరిక గిరిజన తండాల్లో జరుగుతున్న అమానుష దందా ఇది. సంతలో పశువులను అమ్మినట్లుగా అమ్మాయిలను అమ్మేస్తున్నారు. సభ్య సమాజం సిగ్గుపడేలా కాసులకు కక్కుర్తిపడి మానవ విలువల్ని మంటకలుపుతున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో అమాయక గిరిజన యువతులను అమ్మకానికి పెడుతున్న అమానుష దందా పై చేపట్టిన నిఘకు నిర్ఘాంతపోయే నిజాలు బయటకొస్తున్నాయి. నారాయణఖేడ్ ప్రాంతంలోని తండాల్లో నాలుగేళ్లుగా ఈ అమానుష దందా యథేచ్ఛగా జరుగుతున్నట్లు వెల్లడైంది.
అమాయక అమ్మాయిలను పెళ్లి పేరుతో మోసం చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు కొందరు బద్మాష్ లు. డబ్బుల కోసం అమ్మాయిలను రాజస్థాన్ కు చెందిన దళారులను అమ్మేస్తున్నారు. ఈ అమానుష దందా వెనుక పెద్ద నెట్ వర్క్ ఉంది అంటున్నారు స్థానికులు. నారాయణఖేడ్ ప్రాంతంలోని కొన్ని గిరిజన తండాల్లో అమ్మాయిలూ అదృశ్యమవుతున్నారు. రాత్రికి రాత్రే అదృశ్యమవుతున్నారు. ఆ అమ్మాయిలతో పాటు రెండు రోజుల తరువాత తనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా అదృమవుతున్నారు. ఇదంతా ఎవరి చేస్తున్నారు ఎలా జరుగుతుందనే మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. కేవలం పధ్ధెనిమిది సంవత్సరాల నిండినటువంటి ప్రతి అమ్మాయినీ రాజస్థాన్ నుంచి వచ్చిన కొంతమంది ఇక్కడున్న మధ్యవర్తులతో మాట్లాడి సుమారు పదిహేను లక్షలకు బేరం కుదుర్చుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక పోలీసులు మాత్రం పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్నారు.అధికారులు వారి వద్దకు ఇలాంటి వ్యవహారాలు ఏమి తమ వద్దకు రాలేదని నిజంగా ఇలంటి విషయాలు జరిగితే కనుక తగిన చర్యలు తప్పక తీసుకుంటాం అని వెల్లడించారు.ఎదైతే జరుగుతుందో ఈ తండాలపైన వారికి ఒక ఎవైర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని,అలాగే పోలీసులతో పాటు ఉమెన్ వెల్ ఫేర్ సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడతాము ఖచ్చితంగా ఈ దందాను అరికడతామంటూ ఎమ్మెల్యే చెప్తున్నారు.