బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు.. కరోనా టైం లో ఇలాంటివేవో జరుగుతాయని...
posted on Apr 21, 2020 @ 1:33PM
లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో ఆ నలుగురు అమ్మాయిలకు మద్యం ఎక్కడ దొరికిందో ఏమో... నలుగురు యువతులు పీకల్దాకా మందుకొట్టి, ఖాళీగా ఉన్న రోడ్లపైకి విహారానికి వచ్చారు. అంతేనా, పోలీసు చెక్ పోస్ట్ వద్ద వీరంగం సృష్టించారు. ఆపై పోలీసుల చేజింగ్ ను తప్పించుకుని పారిపోయారు. బెంగళూరులోని లీలా ప్యాలెస్ సమీపంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, లీలా ప్యాలెస్ వద్ద చెక్ పోస్టును ఏర్పాటు చేసిన పోలీసులు, అక్కడికి వచ్చే వారి వాహనాలను నిలిపి, వారు ప్రయాణిస్తున్న కారణాన్ని తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ కారును ఆపగా, అందులో నలుగురు యువతులు కనిపించారు. వారిని ప్రశ్నిస్తుంటేనే, తమ వద్ద పాస్ ఉందని, హైయ్యర్ అఫీషియల్స్ తమకు తెలుసునని అనవసర వాగ్వాదానికి దిగారు.
వీరు మందు కొట్టి ఉంటారన్న అనుమానం పోలీసులకు రావడంతో, బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేసేందుకు ప్రయత్నించారు. వెంటనే ఆ యువతులు, పోలీసులపైకి వాహనాన్ని దూకించే ప్రయత్నం చేసి, కారులో పారిపోయారు. పోలీసులు తమ వద్ద ఉన్న బైక్ పై వారికి ఓ కిలోమీటర్ దూరం వరకూ చేజ్ చేశారు. కానీ, కారును వేగంగా నడిపిన అమ్మాయి, వారి కనుచూపు నుంచి వాహనాన్ని తప్పించింది. అప్పటికే కారు నంబర్ ను గుర్తించిన పోలీసులు, దాని ఆధారంగా కేసును విచారిస్తున్నట్టు వెల్లడించారు.