ఆడవారూ గుండె భద్రం

 

 

 

భారతీయ స్త్రీలు ఇటీవల ఎక్కువ గుండె జబ్బులకు గురవుతున్నట్లు తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఒకప్పుడు ఈ జబ్బులకు గురయ్యేవారి సంఖ్య 10 నుంచి 15 శాతంగా ఉంటే ఇప్పుడది 30 శాతానికి పెరిగింది.

 

ఇందుకు మారుతున్న మహిళల జీవన విధానమే ప్రధాన కారణమని నిపుణులు అంచనా -  ఉద్యోగినులలో నానాటికి పెరుగుతున్న మానసిక శారీరక ఒత్తిడిలు గర్బనిరోధక మాత్రల వినియోగం వంటివి వారిలో గుండెజబ్బుల తీవ్రతను పెంచుతున్నాయి.

 

భారతీయ మహిళల్లో లిపో ప్రోటీన్- ఎ అనే పదార్దం ఎక్కువగా వుంటుంది. అది రక్తం గడ్డ కట్టే తత్వాన్ని పెంచడం వల్ల పాశ్చాత్యులకన్నా తక్కువ వయసులోనే ఇక్కడి మహిళలు ఈ వ్యాధుల బారిన పడుతున్నారని వైద్యుల అభిప్రాయం.

 

స్త్రీలను గుండె జబ్బుల నుంచి కాపాడేవి హార్మోన్లు అవి శరీరానికి మంచి చేసే కొలెస్టోరాల్ శాతాన్ని పెంచుతాయి.  ఫలితంగా రక్తనాళాలు   విశ్రాంతిగా ఉండి స్త్రీలను రక్తపోటు, గుండెపోటుల నుంచి కాపాడతాయి. కాని ఇటివల హర్మోనులనే గర్భనిరోధక మాత్రలుగా వాడుతుండటం వల్ల అవి స్త్రీలలో రక్తం గడ్డకట్టే తత్త్వాన్ని పెంచుతున్నాయని అధ్యయనాలు పేర్కొన్నాయి.