రాహుల్ కి ముద్దుపెడితే చంపేసాడు
posted on Mar 1, 2014 @ 11:37AM
ఎవరైన సినిమా తారలు, రాజకీయ నాయకులు.. ఇలా ఎవరైనా తమ గ్రామానికి వచ్చినప్పుడు ఒక షేక్ హ్యాండ్, కుదిరితే ఆటోగ్రాఫ్, ఫోటో దిగడం మాములుగా జరుగుతూనే ఉంటుంది. కానీ తన అభిమాన హీరో/నాయకుడికి ముద్దిచ్చే ఛాన్స్ వస్తే ఎవరు వదులుకుంటారు చెప్పండి. కానీ ఆ ముద్దు ఇవ్వడం వల్ల తాను చనిపోతానని అసలు ఊహించలేము కదా!
అసలు విషయమేమిటంటే... రాహుల్ గాంధీ ఇటీవలే అసోంలోని జోరత్ లో స్వయం సహాయక గ్రూపులతో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు రాహుల్ కు మరింత దగ్గరగా వచ్చి అనుకోకుండా అతని చెంపలపైన, నుదిటిపైన ముద్దులు పెట్టేశారు. అయితే అక్కడే ఉన్న కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యురాలు బొంటీ ఉత్సాహం పట్టలేక రాహుల్ బుగ్గపై ముద్దు పెట్టింది.ఈ విధంగా అక్కడున్న కొంతమంది రాహుల్ కి ముద్దుల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమం అన్ని చానల్స్ లలో ప్రచారం అయ్యింది.
అయితే ఈ విషయం తెలుసుకున్న బొంటీ భర్త తీవ్ర మనస్తాపానికి గురై, భార్యను నిలదీయగా ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. దాంతో బొంటీ భర్త ఆవేశంతో భార్యను సజీవ దహనం చేసి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యయత్నం చేసాడు. బొంటీ ఆ మంటల్లో ఆహుతి అయ్యింది. కానీ ప్రస్తుతం బొంటీ భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.