మద్యానికి రెక్కలు
posted on Aug 27, 2012 @ 9:42AM
ప్రభుత్వానికి ఆదాయవనరులను సమకూరే ప్రతి వనరునీ ఉపయోగించు కుంటుంది. అలాంటి ఆదాయవనరుల్లో మద్యం తిరుగులేనిది.రాష్ట్రంలోని 6596 మద్యం దుకాణాలకు 637 మద్యం దుకాణాలు 2012-13 ఎక్సైజ్ సంవత్సరంలో మిగిలాయి. దీంతో ప్రభుత్వం సుమారు 2500 కోట్ల రూపాయలను లైసెన్సు రూపంలో కోల్పోయింది. వీటితో ఎలాగైనా ఖజానాకు డబ్బులు రాబట్టాలన్న ప్రభుత్వం ప్రీమియం మద్యంపై అదనపు ప్రివిలేజ్ పన్నును 12.5 శాతం పెంచింది. తాజాగా ఎపిబిసిఎల్ కు మద్యం సరఫరా చేసే తయారీ దారులనుండి ఒప్పందం ముగియటంతో త్వరలో మద్యం ధరలకు రెక్కలు రానున్నాయి. అలాగే సోమవారం నుండి మద్యం పైనుండే చిల్లరను సమీప రూపాయలకు రౌండప్ చేసి అమ్మనున్నారు.ఆంద్రప్రదేశ్ బ్రెవరేజస్ కార్పొరేషన్ సరఫరా చేసే మద్యం ధరలు కూడా రౌండిరగ్ కారణంగా పెరగనున్నాయి. వ్యాపారులకు ఇష్యూ ప్రైజ్‌స్‌గా పిలిచే ఈ స్ధిర ధరలను చిల్లరపేరుతో మధింపు చేసారు. అంటే చిల్లరి తర్వాతి అధిక రూపాయితో సమానం చేస్తారు. దీంతో వ్యాపారులకు మద్యం సరఫరాచేసే రేట్లు పెరిగి మద్యం మరింత ప్రియం కానుంది. ఈ రెండు పద్దతుల్లో పెరుగుదల అంతిమంగా మందుబాబులపైనే పడుతుంది. అంటే 49.14 రూపాయలున్న బాటిల్ ధర ఇకపై 50 రూపాయలవుతుంది.అదేవిధంగా 47రూపాయలున్న బాటిల్ ఖరీదు 50 రూపాయలుగా మారుతుంది. అంటే గరిష్టంగా ఒక్కో బాటిల్ ఖరీదు 20శాతం పెరగనుంది. దీంతో ప్రతి లిక్కర్ కేస్‌కు 200 రూపాయలు పెరగనుంది. దీంతో మద్యం ధరలు పెరిగి మందుబాబులకు జెలక్ ఇస్తుంది. దీని ద్వారా ఏడాదికి 1000 కోట్లు ఖజనాకు చేరనుంది.