మందుబాబులకు బ్యాడ్ న్యూస్... మూడ్రోజుల వైన్ షాపులు బంద్
posted on Nov 4, 2023 @ 5:35PM
పోలింగ్ కు కొన్ని గంటల ముందు వోటర్లపై మద్యం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ నెల 30వ తేదీన మన రాష్ట్రంలో పోలింగ్ఉంది. పోలింగ్ కు ముందు మద్యం అమ్మకాలను కట్టడి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కెసీఆర్ ప్రభుత్వం ఆపద్దర్మ ప్రభుత్వంగా మారిపోయింది. మద్యం అమ్మకాల మీద ఆదాయం పెంచుకున్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ నెల 28,29,30 తేదీల్లో మద్యం అమ్మకాలను నిలిపి వేయనుంది.వోటర్లు మద్యంతో ప్రలోభపడే అవకాశం ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారి చేయడంతో మద్య.మందుబాబులకు ఇది బ్యాడ్ న్యూస్ . తిరిగి వచ్చేనెల ఒకటో తేదీ నుంచి వైన్ షాపులు తెరచుకుంటాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ రావటంతో… నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే శాంతి భద్రతల విషయంలో పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకునే పనిలో పడ్డారు.