Read more!

ఎన్నికల ప్రచారం: భ్రమల్లో ప్రియాంక!

 

 

 

ఇంతవరకూ తెలియలేదుగానీ, సోనియాగాంధీ కూతురు ప్రియాంకకి తన గురించి తానే ఎక్కువగా ఊహించుకునే సమస్యేదో ఉన్నట్టుంది. తాను ఎన్నికల బరిలో దిగి ప్రచారం మొదలెడితే కాంగ్రెస్ పార్టీ సూపర్‌గా గెలిచేస్తుందనే భ్రమల్లో ఉన్నట్టుంది. ఆ భ్రమలు ఆమెకి సోనియా, రాహులే కల్పించినట్టున్నారు. ఈ ఎన్నికలలో సోనియా, రాహుల్ గెలుపే ప్రశ్నార్థకంగా వుంది. ఈ భయంతోనే రాయబరేలి, అమేథి నియోజకవర్గాలలో ప్రియాంక చేత కూడా ప్రచారం చేయించాలని అనుకుంటున్నారు.

 

అమ్మకోసం, సోదరుడి కోసం ప్రచారం చేయడానికి ఒప్పుకున్న ప్రియాంక కేవలం ఆ రెండు నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేస్తానని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది. సోనియా, రాహుల్‌ని గెలిపించుకోవడం తన బాధ్యత అన్నట్టుగా ప్రియాంక భారీ సెంటిమెంట్ డైలాగ్స్ కొడుతోంది. తనచేత ప్రచారం చేయించుకోవాలని చాలామంది కాంగ్రెస్ అభ్యర్థులు ఉవ్విళ్ళూరుతున్నానని, తాను మాత్రం కేవలం తన కుటుంబ సభ్యులు ఇద్దరికి మాత్రమే ప్రచారం చేస్తానని అంటోంది. ప్రియాంక మాటలు వింటుంటే తాను ప్రచారం చేస్తే ఎవరైనా గెలిచేస్తారన్న అతి విశ్వాసం కనిపిస్తోంది.