గీతారెడ్డి రాజీనామా చేస్తారా?
posted on Feb 7, 2014 @ 10:18AM
ఢిల్లీలో ఏపీభవన్ వద్ద మహిళా మంత్రులపై భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు పట్ల రాష్ట్ర మంత్రి గీతారెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు. తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేసే ఆలోచనలో వున్నట్లు రాజకీయవర్గాల సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్ బుధవారం తన దీక్ష కోసం ఏపీభవన్ నుంచి బయలుదేరుతున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయనను నిలువరించేందుకు ప్రయత్నించారు. ఈ సంధర్బంగా అక్కడ వున్న భద్రతా సిబ్బంది మహిళా మంత్రులపై దూరుసుగా ప్రవర్తించారట. దీంతో మంత్రి గీతారెడ్డి నొచ్చుకున్నారు. అయితే ఈ ఘటనపై ప్రధాని, రాష్ట్రపతిలు విచారణ వ్యక్తం చేయగా...రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కిరణ్ మహిళా మంత్రులను సంప్రదించి విచారణ వ్యక్తం చేయకపోవడంపై ఆమె మండిపడుతున్నారు. మరోవైపు గీతారెడ్డికి జరిగిన అవమానానికి సొంత నియోజకవర్గమైన జహీరాబాద్ లో తెలంగాణ వాసులు కిరణ్ కుమార్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసి బంద్ నిర్వహించారు.