మోడీ కి హితులు ఎవరు..? స్నేహితులెవరు..?
posted on Feb 9, 2021 @ 1:44PM
మోడీ స్నేహితులు ఎవరు..? స్నేహితులెవరు..? ఒక మతం వాళ్ళా.. లేదంటే బిజెపి నాయకులా.. మోడీ స్నేహితులు ఎవరనే ప్రశ్నకి సమాధానం మాత్రం ఒకటే అని చెప్పాలి.. దేశం హితం కోరే వాళ్ళే మోడీకి హితులు.. స్నేహితులు..ఇలా చెపుతూ రాజ్యాసభ లో ప్రధాన మంత్రి మోడీ ఉద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ పై ప్రధాని మోడీ రెండోరోజూ ప్రశంసల వర్షం కురిపించారు. ఫిబ్రవరి 15తో ఆజాద్ రాజ్యసభ పదవీ కాలం ముగియ్యనుండగా.. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఆజాద్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టుకున్నారు. ‘‘ఉన్నత పదవులు వస్తుంటాయి, పోతుంటాయి .. అధికారమూ వస్తుంది, పోతుంది.. కానీ ఎన్ని పదవులు వచ్చిన.. ఎలా వుండాలో ఆజాద్ దగ్గర నేర్చుకోవాలని మోడీ అన్నారు.. ఇలాంటి స్నేహితుడు ఉంటే చాలదా అంటూ.. ఆజాద్ నాకు నిజమైన స్నేహితుడు.’’ అంటూ మోడీ మాట్లాడారు.
‘‘గుజరాతీ పర్యాటకులపై కశ్మీర్ లో ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనపై ఆజాద్ నాకు ఫోన్ చేసి, బాధపడుతూ ఏడ్చేశారని, నేరుగా విమానాశ్రయానికే వచ్చేశారని. ఓ కుటుంబ పెద్దగా బాధితులపై శ్రద్ధ చూపారని మోడీ చెప్పారు. ఆ సమయంలో మృత దేహాన్ని తరలించడానికి ఓ ఏయిర్ ఫోర్స్ విమానం కావాలని అప్పటి రక్షణ మంత్రి ప్రణబ్ దాదా ఏదో ఒకటి కచ్చితంగా ఏర్పాటు చేస్తానని చెప్పారని తెలిపారు. ఆజాద్ మంచి స్నేహితుడు మాత్రమే కాదు.. దేశ సేవకుడు కూడా అంటూ మోడీ హర్షం వ్యక్తం చేశారు.. గులాంనబీ ఆజాద్ కేవలం పార్టీ కోసమే ఆలోచించలేదని, దేశం కోసం ఆలోచించారని ప్రశంసించారు.. ఆయన వల్ల దేశానికి చాలా లాభం జరిగిందని, ఆయన చేసిన సేవలకు ధన్యవాదాలు చెపుతూ.. దేశం కోసం గులాంనబీ ఆజాద్ సూచనలు, సలహాలను ఎప్పటికీ స్వాగతిస్తూనే ఉంటాం అంటూ ఆజాద్‌కు మోడీ సెల్యూట్ చేశారు. శరద్ పవార్ కూడా అచ్చు ఇలాగే ఉండేవారని మోడీ వ్యాఖ్యానించారు. ఆజాద్ తర్వాత ఆ సీట్లో ఎవరు కూర్చున్నా, చాలా సవాళ్లను స్వీకరించాల్సి ఉంటుందన్నారు ప్రధాని మోడీ.