వెయ్ ప్రోటీన్ మార్కెట్లో కొనక్కర్లేదు ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు!
posted on Dec 17, 2024 @ 9:30AM
ప్రోటీన్ శరీరానికి చాలా అవసరం. ముఖ్యంగా ఈ మద్యకాలంలో శారీరక స్పృహ, ఆరోగ్య స్పహ పెరగిన కారణంగా ప్రోటీన్ తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం పట్ల ఆసక్తి పెరిగింది. ప్రోటీన్ లోపం ఉండకూడదని చాలామంది ప్రోటీన్ పౌడర్లు కూడా వాడుతుంటారు. దీనికి తగ్గట్టే ప్రోటీన్ పౌడర్ ఉత్పత్తులు చాలా విరివిగా మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. వీటిలో వెయ్ ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. వెయ్ ప్రోటీన్ అంటే పాటవిరుగుడుతో తయారుచేస్తారు.మార్కెట్లో అమ్మే వెయ్ ప్రోటీన్ వాడటం మంచిదేనా? దీన్ని ఇంట్లోనే ఎలా చేసుకోవ్చచు? తెలుసుకుంటే..
మార్కెట్లో అమ్మే వెయ్ ప్రోటీన్ చాలా ఖరీదుగా ఉంటుంది. అయితే ఆరోగ్యం కోసం ఎంతైనా ఖర్చు పెడుతూ ఉంటారు. ఈ వెయ్ ప్రోటీన్ కూడా బాడీ బిల్డింగ్ చేసేవారు, అధికంగా వ్యాయామాలు చేసేవారికి అవసరం. జిమ్ కు వెళుతూ వెయ్ ప్రోటీన్ ను వాడిన 19 ఏళ్ల కుర్రవాళ్లు కిడ్నీ ఫెయిల్ అయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మార్కెట్లో లభించే వెయ్ ప్రోటీన్ లో ప్రోటీన్ మాత్రమే కాకుండా చాలా రసాయనాలు కూడా ఉంటాయి. ఇవి శరీరాన్ని చాలా దెబ్బతీస్తాయి.
ప్రతి ఒక్కరికీ ప్రోటీన్ అవసరమే కానీ బాడీ బిల్డర్లకు అవసరమైనంత మాత్రం అవసరం లేదు. అందుకే వెయ్ ప్రోటీన్ ను ఇంట్లోనే తయారు చేసుకుని వాడటం సురక్షితం అంటున్నారు పోషకాహార నిపుణులు.
పాలు..
పాలు తాగడం వల్ల చాలావరకు వెయ్ ప్రోటీన్ లభిస్తుందని అంటున్నారు. ప్రతి ఒక్కరూ పాలు తాగాలని అది ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు. పాలలో దాదాపు 80శాతం పైన కేసైన్ ప్రోటీన్, 20శాతం వెయ్ ప్రోటీన్ ఉంటుంది.
వెయ్ ప్రోటీన్..
పాల విరుగుడుతో చేసే ప్రోటీన్ నే వెయ్ ప్రోటీన్ అంటారు. అయితే దీన్ని ఇంట్లో కూడా తీసుకోవచ్చు. పాలను మొదటగా జున్నులాగా చేయాలి. దీని నుండి పన్నీర్ వస్తుంది. పన్నీర్ ను వేరు చేసిన తరువాత నీరు మిగిలిపోతాయి. చాలామంది ఈ నీటిని పడేస్తుంటారు. కానీ వెయ్ ప్రోటీన్ ఇందులోనే ఉంటుంది. పాలలో ఉండే కేసైన్ ప్రోటీన్ పన్నీర్ లోకి వెళ్లిపోతుంది. పాలలో ఉండే వెయ్ ప్రోటీన్ ఈ నీటిలో ఉంటుంది. ఈ నీటిని పారబోయకుండా ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.
వెయ్ ప్రోటీన్ కండరాల పెరుగుదలను వేగవంతం చేస్తుంది. ఇది శరీర బరువును పెంచుతుంది, బలాన్ని పెంచుతుంది. కొన్ని పరిశోధనలలో, ఇది అధిక BP మరియు మధుమేహాన్ని నియంత్రించగలదని కూడా కనుగొనబడింది . ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది.
*రూపశ్రీ.