తిరిగి ప్రారంభమైన వాట్సాప్ సేవలు
posted on Oct 25, 2022 @ 4:12PM
నిలిచిపోయిన రెండున్నర గంటల తరువాత ఎట్టకేలకు వాట్సాప్ సేవలు పున: ప్రారంభమయ్యాయి. ప్రముఖ మేసేజింగ్ ఇంజిన్ వాట్సాప్ సేవలు సంకేతిక సమస్యలతో మంగళవారం (అక్టోబర్ 26) మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుంచి నిలిచిపోయాయి.
ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ సేవలు నిలిచిపోవడంతో నెటిజన్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. ట్విట్లర్ వేదికగా వాట్సాప్ సేవల స్తంభనపై పలువురు నెటిజన్లు ఫిర్యాదులు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలోనూ వాట్సాప్ సేవలు నిలిచిపోవడంతో మెటా.. వివరణ ఇచ్చింది.
సాంకేతిక సమస్యల కారణంగా వాట్సాప్ సేవలు నిలిచిపోయాయని పేర్కొంది. సధ్యమైనంత త్వరలో ఈ సేవలను పునరుద్ధరిస్తామని పేర్కొంది. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ చెప్పింది. కాగా దాదాపు రెండున్నర గంటల తరువాత మధ్యాహ్నం 3 గంటల సమయంలో వాట్సాప్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.
వాట్సాప్ సేవలు నిలిచిపోవడానికి గల కారణాలపై ఆ సందస్థ విచారణ చేపట్టింది. కాగా వాట్సప్ సేవలు నిలిచిపోవడం వెనుక ఏదైనా ఉగ్ర కోణం ఉందా అన్న అనుమానాన్ని భారత ఐటీ శాఖ అనుమానం వ్యక్తం చేసింది. అయితే వాట్సాప్ హ్యాకింగ్ కు గురయ్యే అవకాశాలు ఇసుమంతైనా లేవని ప్రొవైడర్లు చెబుతున్నారు.