పాత స్మార్ట్ ఫోన్ అమ్మాలనుకుంటున్నారా..ఈ 5 జాగ్రత్తలు అస్సలు మిస్ కావద్దు..!
posted on Oct 9, 2025 @ 9:30AM
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కొత్త స్మార్ట్‌ఫోన్ కావాలని కోరుకుంటారు. కానీ చాలామంది తొందరపడి ముందు వెనుకా ఆలోచించకుండా పాత ఫోన్‌ను అమ్మేస్తారు లేదంటే వేరొకరికి ఇస్తారు. పాత ఫోన్ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుకు మరికొంత డబ్బు సమకూర్చుకుని కొత్త ఫోన్ కొనడం చాలామంది చేసే ప్లాన్. అయితే పాత ఫోన్ అమ్మే ముందు ఫోన్ డేటాను సరిగ్గా తొలగించకపోవడం అతిపెద్ద తప్పని సైబర్ నిపుణులు అంటున్నారు.
పాత ఫోన్ ఫోటోలు, వాట్సాప్ చాట్‌లు, బ్యాంకింగ్ వివరాలు, ఇమెయిల్‌లు, పాస్‌వర్డ్‌లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని నిల్వ చేస్తుంది. అది పొరపాటు తప్పుచేసే వ్యక్తుల చేతుల్లోకి వెళితే చాలా నష్టాన్ని ఎదుర్కొవాల్సి ఉంటుంది. చాలా మంది ఫోన్ అమ్మే ముందు ఫ్యాక్టరీ రీసెట్ చేయడం లేదా తొలగించడం చేస్తే డేటా తొలగిపోతుంది అనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల డేటా పూర్తిగా తొలగించబడదు. అలా చేసిన డేటాను దాన్ని తిరిగి పొందవచ్చు. కాబట్టి పాత ఫోన్‌ను విక్రయించే లేదా మార్పిడి చేసే ముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
పాత ఫోన్ అమ్మే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
ఫోన్ Android Lollipop (5.0) లేదా ఆ తర్వాతి వెర్షన్ లో ఉంటే అందులో FRP (ఫ్యాక్టరీ రీసెట్ ప్రొటెక్షన్) ఫీచర్ ఉంటుంది. దానిని తీసివేయాలి, లేకుంటే పాత ఫోన్ కొనే వ్యక్తి ఫోన్‌ను ఉపయోగించలేరు.
ఫోన్ పాత వెర్షన్‌ను అమలు చేస్తుంటే, ఈ దశను స్కిప్ చేయవచ్చు. ఫోన్ వెర్షన్‌ను చెక్ చేయడానికి, సెట్టింగ్‌లు > అబౌట్ ఫోన్ > ఫోన్ > సాఫ్ట్‌వేర్ సమాచారం కు వెళ్లాలి.
ఫ్యాక్టరీ రీసెట్ చేసేముందు..
పాత ఫోన్ ను అమ్ముతున్నా లేదా.. కొత్త ఫోన్ కొనడానికి ఫోన్ ను ఎక్స్చెంజ్ కోసం ఇస్తున్నా ఫ్యాక్టరీ రీసెట్ చేయడం సరిపోదు. ఎందుకంటే కొన్నిసార్లు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సహాయంతో పాత డేటాను తిరిగి పొందవచ్చు.
ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి, నకిలీ డేటాను అప్‌లోడ్ చేసే ఉపాయాన్ని కనిపెట్టారు.
దీన్ని చేయడానికి.. ఫ్యాక్టరీ రీసెట్ చేసే ముందు ఫోన్‌లోని అనవసరమైన (జంక్) డేటాను యాడ్ చేయాలి. ఇది ఫోన్ స్పేస్ ను ఫుల్ చేస్తుంది. అంటే పెద్ద వీడియో ఫైల్‌లు, పాటలు, సినిమాలు లేదా మీకు అవసరం లేని ఏదైనా ఇతర డేటా యాడ్ చేయవచ్చు.
దీని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, ఫోన్ అసలు డేటా ఇప్పటికే ఎన్‌క్రిప్ట్ చేయబడి, ఈ కొత్త అనవసరమైన డేటా అందులో యాడ్ చేశాక, పాత ఫైల్‌లు పూర్తిగా హైడ్ అయిపోతాయి.
అటువంటి పరిస్థితిలో, పాత ఫోన్ కొనుక్కున్న కొత్త వ్యక్తి ఫోన్ నుండి డేటాను తిరిగి పొందడానికి ప్రయత్నించినప్పటికీ, వారు ఈ జంక్ ఫైల్‌లను మాత్రమే కనుగొంటారు, వ్యక్తిగత సమాచారాన్ని కాదు.
కాబట్టి పాత ఫోన్ అమ్మే ముందు లేదా కొత్త ఫోన్ కోసం ఎక్స్చేంజ్ కు ఇచ్చే ముందు ఈ పద్దతిని తప్పకుండా ఫాలో కావాలి.
*రూపశ్రీ.