ఆ నవ్వుకి అర్ధం ఏమిటి?
posted on May 22, 2025 @ 2:10PM
అరెస్టు చేయడానికి వచ్చినపుడు బయట పోలీసుల ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. అది చూసి నిందితుడు రెచ్చిపోయి, ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తాడు. అరెస్టు చేసి సెల్ లో వేశాకా, పోలీస్ మర్యాద మరో రకంగా ఉంటుంది. చిల్లర దొంగతనాలు చేసి తరచూ జైలుకెళ్ళే వారికి ఆ తేడా తెలుసు కానీ, ఇటీవల బడా రాజకీయా నాయకులు అరెస్టుల క్యూ పెరిగాక, లాకప్ లు, జైలు గదులు నిండపోయాక వారి ప్రవర్తనలోనూ వింత మార్పులు కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో వైసీపీ అధినేత జగన్ ను అరెస్టు చేస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయనలో ఆందోళన మొదలైనట్లుంది. గత నాలుగు రోజులుగా మీడియా ముందుకు వచ్చినప్పుడు ఎవరినీ వదిలిపెట్టం. రాసి పెట్టుకోండంటున్నారు. మొన్నటి వరకూ బట్టలూడదీస్తాం అని చెబుతున్న నేపథ్యంలోనే ఆయన సహచర, అనుచరగణం ఒక్కొక్కరూ అరెస్టై జైలు ఊచలు లెక్కిస్తున్నారు. అయినా ఆయన రంకెలు తగ్గలేదు. ఇదే విషయాన్ని తాజాగా ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ని ఒక మీడియా ప్రతినిథి ప్రశ్నిస్తే.. ఆయన ఆసాంతం విని పకపకా నవ్వారు. అంతే తప్ప కామెంట్ చేయలేదు.
దాంతో ఆయన నవ్వుకి అర్ధం ఏమిటి అని వెతుక్కోవలసిన పనిలో పడ్డారు పాత్రికేయులు. రేపో మాపో ఆయన కూడా అరెస్టయ్యేవాడేననీ, దానికే రంకెలు వేస్తున్నాడనీ అర్ధం కాబోలు అనుకుంటూ పాత్రికేయులు చర్చించుకుంటున్నారు. జగన్ జైలు కెళితే లెక్కలు రాసుకుని ఉపయోగం ఏమిటి? ఈ కేడర్ తర్వాత కూడా ఆయన వెంటే ఉంటుందా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.