బాసర ట్రిపుల్ ఐటీకి ఏమైంది?
posted on Aug 4, 2022 @ 11:33PM
తెలంగాణలో ప్రతిష్ఘాత్మకమైన బాసర ట్రిపుల్ ఇటీ ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సౌకర్యాల కోసం ఆందోళనకు దిగడం దగ్గర నుంచి తరచూ ఫుడ్ పాయిజినింగ్ జగరడం వరకూ తరచూ వార్తలలో నిలుస్తోంది. తాజాగా బాసర ట్రిపుల్ ఐటీలో మధ్యాహ్న భోజనం తిన్న తరువాత విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులతో అస్వస్థతకు గురైన విద్యార్థులకు క్యాంపస్ లోని ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజనింగ్ వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్న వార్తలను అధికారులు ఖండించారు. సీజనల్ వ్యాధుల వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు చెప్పారు. బాధితుల ఆరోగ్యం నిలకడగానే ఉందనీ ఎలాంటి ఆందోళనా అవసరం లేదని పేర్కొన్నారు. కొద్ది రోజుల కిందట కూడా ట్రిపుల్ ఇటీ లో విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.
తరచూ ఫుడ్ పాయిజినింగ్ జరుగుతోందనీ, మెస్ కాంట్రాక్టర్ ను మార్చాలనీ డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు కూడా దిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఇన్ చార్జి వీసీ హామీ మేరకు విద్యార్థులు ఆందోళన విరమించారు. ఇది జరిగిన రోజుల వ్యవధిలో మళ్లీ ఫుడ్ పాయిజినింగ్ జరగడం పట్ల ఆందోళన వ్యక్త మౌతోంది. అంతకు ముందు హాస్టల్ లో సౌకర్యాలు కల్పించాలనీ, విసీని నియమించాలని విద్యార్థులు ఆందోళన చేసిన సంగతీ తెలిసిందే.
విద్యార్థుల డిమాండ్లు సిల్లీ డిమాండ్లని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలు, ఆ తరువాత ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని ఆమె స్వయంగా బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లి విద్యార్థులతో చర్చించి వారి డిమాడ్లు నెరవేరుస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింప చేసిన సంగతి విదితమే. ఇప్పుడు స్వల్ప వ్యవధిలో ట్రిపుల్ ఐటీ హాస్టల్ లో మధ్యాహ్న భోజనం తిన్న తరువాత విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులలో ఆందోళన వ్యక్తమౌతోంది.
ఇటీవల కూడా బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో యూనివర్సిటీలో ఆందోళనలు చెలరేగాయి. తరచూ ఫుడ్ పాయిజన్ అవుతోందని.. హాస్టల్ మెస్ కాంట్రాక్టర్‌ను మార్చాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. యూనిర్సిటీకి పూర్తి స్థాయి వీసీ లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఇంచార్జి వీసీ చర్చలతో ఈ ఆందోళనను విద్యార్థులు విరమించారు. తాజాగా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు అస్వస్థతకు గురికావడం మరోసారి చర్చనీయాంశమవుతోంది.