సంపన్న దేశాల్లో భారత్ కు స్థానం.. టాప్ టెన్ లో
posted on Aug 23, 2016 @ 6:05PM
ప్రపంచంలోని సంపన్న దేశాల్లో భారత్ కు చోటు దక్కింది. టాప్ టెన్ దేశాల్లో మన ఇండియా ఏడో స్థానంలో ఉంది. వినడానికి కొంచెం అశ్చర్యంగా ఉన్న ఇది మాత్రం నిజం. న్యూ వరల్డ్ హెల్త్ అనే సంస్థ చేసిన సర్వేలో అగ్రరాజ్యమైన అమెరికా 48.90 లక్షల కోట్ల డాలర్ల వ్యక్తిగత సంపదతో మొదటి స్థానంలో ఉంది. ఇక 17.40 లక్షల కోట్ల డాలర్లతో చైనా రెండో స్థానంలో ఉండగా, 15.10 లక్షల కోట్ల డాలర్లతో జపాన్ మూడో స్థానంలో ఉంది. యూకే, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆతరువాతి స్థానంలో భారత్ చోటు సంపాదించుకుంది. పౌరుల వ్యక్తిగత ప్రైవేటు ఆస్తులను బట్టి వారి సంపదను అంచనా వేశారు.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఎంటంటే.. 130 కోట్ల జనాభా ఉన్న మన వద్ద 5.60 లక్షల కోట్ల డాలర్ల ఉమ్మడి సంపద ఉంటే.. ఆస్ట్రేలియాలో 2.2 కోట్ల మంది మాత్రమే ఉన్నప్పటికీ వారి వద్ద 4.4 లక్షల కోట్ల డాలర్ల సంపద ఉంది. ఇక చైనా జనాభాకి మన జనాభాకి పెద్దగా తేడా లేకపోయినా.. చైనా మాత్రం మనకు అందనంత దూరంలో ఉంది. మరి ఈ లెక్కన చూస్తే ఎంత టెన్ సంపన్నదేశాల జాబితాలో భారత్‌కు స్థానం దక్కించుకున్నా.. తలసరి ఆదాయం పరంగా చూస్తే మనం పేదరికంలో ఉన్నట్లే భావించాలి.