అసంతృప్తితో అతిగా టీవి

అదేపనిగా టీవి చూడటంలో మునిగిపోతున్నారా? అయితే మీరు తాజాగా వెలుగుచూసిన ఓ సర్వే వివరాలు తెలుసుకోవాల్సిందే. మేరీ ల్యాండ్ విశ్వవిద్యాలయం నలబై వేలమందితో చేసిన అధ్యయనం ఆసక్తిగొలిపే విషయాలను బయటపెట్టింది. వివిధ రకాల సమస్యలు, కోరికలుండి అవి తీరక అసంతృప్తితో ఉన్నవారు అధికంగా టీవి చుస్తుంటారని ఆ సర్వే వెల్లడించింది.

ఆనందంగా ఉదేవారు టీవి చూసే గంటలతో పోల్చినపుడు అసంతృప్తిపరులు 30 శాతం అధికంగా కార్యక్రమాల విక్షణకు కేటాయిస్త్రున్నారు. తాత్కాలికంగా ఇది మనసుకు ఊరటనిచినప్పటికి దీర్ఘకాలంలో తీవ్ర నిరాశకు గురి చేస్తుందనేది సారాంశం. ఈ అసంతృప్తికి దూరం కావడం ఎలా అనేది దాన్లోనే బయటపడింది. పుస్తకాలు చదవడం ,స్నేహితులతో కాలక్షేపం చేయడం చక్కటి లైంగిక సంబంధాలు కలిగి ఉండటంవంటివి ఆనందానికి అసలైన మార్గాలని సర్వేలో పాల్గొన్న వారు తేల్చి చెప్పారు.