ఆసియా కప్... కోచ్‌గా ద్రావిడ్ స్థానంలో లక్ష్మణ్
posted on Aug 25, 2022 @ 2:45PM
ఏదయినా సమస్య తలెత్తినపుడు పరిష్కారమార్గం ఆలోచిస్తే నెమ్మదిమీద తెలుస్తుంది. క్రికెట్ పరంగా చూస్తే భారత జట్టుకు అలాంటి అనేక సందర్భాల్లో గొప్ప ప్రశాంతతను, విజయాన్ని ఇచ్చినవాడు వి.వి.ఎస్. లక్ష్మణ్. ఇది యావత్ క్రికెట్ లోకం అంగీకరిస్తుంది. గవాస్కర్, కపిల్, అజరుద్దీన్ వంటి సీనియర్లు కూడా లక్ష్మణ్ గురించి ఇలానే చెప్పడం లక్ష్మణ్ ప్రత్యేకత. కానీ వివిఎస్ మాత్రం మహా సింపుల్‌గా ఉంటాడు. అదంతా వారి అభిమానం తప్ప మరోటి కాదంటాడు. అతనికి వాస్తవానికి భారత్ జట్టులో ప్రపంచకప్ పోటీల్లో స్థానం కల్పించకపోవడమనే అన్యాయం జరిగింది. కానీ అతను మాత్రం దాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. కారణం తాను భారత్ జట్టులో ఉండాలనుకుంటున్నాడేగాని టోర్నీ ప్రాధాన్యం కాదన్నాడు.
ఇలాంటి వాడు ఆ తర్వాత కోచ్ అవతారం ఎత్తడం జట్టుకు ఎంతో మేలే జరిగింది. ఎందుకంటే ఆటలో ద్రావిడ్‌తో సమానుడు, ప్రవర్తనలో, ఇతరు లను, పరిస్థితులను ద్రావిడ్‌లా కూల్‌గా అర్ధంచేసుకుని ముందడుగు వేయగల సమర్ధుడు. అందుకే మిస్టర్ కూల్ ధోనీ కూడా వివిఎస్ మీద గౌరవాన్నే వ్యక్తం చేశాడు అనేక పర్యాయాలు. చిత్రమేమంటే, ఇపుడు మళ్లీ అతని అవసరం జట్టుకు ఎంతో కావ లసి వచ్చింది.
కోవిడ్ పాజిటివ్ పరీక్ష తర్వాత రాహుల్ ద్రవిడ్ కోలుకోలేకపోయినందున రాబోయే ఆసియా కప్ 2022 కోసం వివిఎస్ లక్ష్మణ్ తాత్కాలిక ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పగించామని, అతని టెస్ట్ ఫలితాలు ప్రతికూలంగా వచ్చిన తర్వాతే ద్రవిడ్ బాధ్యతలు స్వీకరిస్తారని బిసిసిఐ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. యూఏఇ లో జరగబోయే ఆసియా కప్ 2022 కోసం భారత క్రికెట్ జట్టు తాత్కాలిక ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్థానంలో ప్రస్తుత జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సిఏ) హెడ్, మాజీ బ్యాట్స్‌మెన్ లక్ష్మణ్ ను తీసుకున్నారు.
ఐర్లాండ్‌లో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 కోసం లక్ష్మణ్ భారత ప్రధాన కోచ్‌గా అడుగు పెట్టాడు. అతని నేతృత్వంలోని మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించడంతో పాటు పలువురు యువ ఆటగాళ్లు తమ దైన ముద్ర వేయగలిగారు. భారత ప్రధాన కోచ్‌గా లక్ష్మణ్ ఆకట్టుకోవడానికి గల 3 కారణాలను ఇక్కడ చూద్దాం. లక్ష్మణ్ ఆటగాళ్ల కు నిర్దిష్ట పాత్రను, మైదానంలో తమను తాము వ్యక్తీకరించే స్వేచ్ఛను ఇచ్చినట్లు అనిపించింది. యువ ఆట గాళ్ళు తమకు తాము గా మంచి ఖాతాని అందించగలిగారు, ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ లో పాల్గొనే భారత జట్టుకీ ఇది మంచి సూచన. లక్ష్మణ్ నేతృత్వంలో కుర్రాళ్లు మరింత పదునుగా తయారవుతారనే నమ్మకం ఉంది. వాళ్లకు వారి లోపాలు తెలియజేయడం, వాటిని అధిగమించేందుకు వెన్నుదన్నుగా నిలవడంలో మంచి సూచనలతో కుర్రాళ్లను ఉరకలు వేయించడంలో దిట్టగా లక్ష్మణ్‌ను ప్లేయర్లు పేర్కొంటారు. టీమ్ ను లక్ష్మణ్ నిర్వహించగలిగిన విధానం పట్ల బీసీసీఐ సంతోషి స్తుంది. అతను ఐర్లాండ్‌లో హార్దిక్ పాండ్యాతో కలిసి పని చేశాడు, ఇంగ్లాండ్‌పై రోహిత్ శర్మతో జతకట్టాడు. విదేశీ పరిస్థితుల్లో ఆ జట్టు ఆడే విధానంలో నిలకడ ఉంది.
లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పగించడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు, అతను హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ఐర్లాండ్‌కు వెళ్లే భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు, ఇక్కడ జట్టు రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆతిథ్య జట్టును 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. అంతేకాకుండా, రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లో ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో టెస్ట్ జట్టు ఆడినందున అతను జట్టు తో పాటు ఉన్నాడు. కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలో భారత్ గెలిచిన మొదటి టీ20 తర్వాత లక్ష్మణ్ ఇంగ్లాండ్‌ను విడిచి పెట్టాడు.
లక్ష్మణ్‌కు టీమ్ పటిష్టంగా, ఎలాంటి విభేదాలకు అవకాశం లేని విధంగా ముందుకు నడిపించడంలో కెప్టెన్ అభిప్రాయానికీ అంతే గౌరవం ఇస్తూ, టీమ్‌లో చిన్న ప్లేయర్‌తో సహా అందరి మాటా వింటూ తగిన సలహాలిస్తూ వారిని సమష్టిగా విజయం సాధించే దిశగా ముందడుగు వేయించడం లక్ష్మణ్‌కి బాగా ఎరుకే. అందుకే భారత్ క్రికెట్ అధికారులు జట్టుకు ద్రావిడ్ స్థానం భర్తీ చేయగలి గినవాడిగా లక్ష్మణ్‌కు అవకాశం ఇచ్చారు.