పెళ్ళి చేసుకోమంటే విషం తాగిన ప్రియుడు
posted on May 14, 2014 @ 4:52PM
ప్రేమనగర్ సినిమాలో ప్రియుడు ‘మధువు తాగనన్నాను.. విషం తాగమన్నావు’ అని పాడతాడు. హైదరాబాద్‌లో ఓ ప్రేమికుడు మాత్రం ‘పెళ్ళి చేసుకోమన్నావు.. విషం తాగుతున్నాను’ అని విషం తాగి చనిపోయాడు పెళ్ళి చేసుకొమ్మంటూ ప్రియురాలు పెట్టే టార్చర్ భరించలేక సత్యనారాయణ అనే వ్యక్తి వ్యక్తి విషం తాగి చనిపోయాడు. సత్యనారాయణకు ఆల్రెడీ పెళ్లయింది. ప్రైవేట్ జాబ్ చేసేవాడు. తన ఆఫీసులోనే పనిచేసే ఒక యువతిని ప్రేమించాడు. ప్రేమించావు కదా పెళ్ళి చేసుకో అని ఆమె చాలాకాలంగా ఒత్తిడి చేస్తోంది. ఈ విషయమై వీళ్ళిద్దరూ పలుమార్లు గొడవ పడ్డారు. ఈ క్రమంలో విషం బాటిల్‌తో సత్యనారాయణ ఇంటికి వచ్చిన సదరు ప్రియురాలు ‘పెళ్లి చేసుకుంటావా.. విషం తాగమంటావా’ అంటు బెదిరించింది. దాంతో ఈ ప్రేమ వ్యవహారం అతని ఇంట్లో కూడా తెలిసిపోయింది. దీన్ని భరించలేకపోయిన సత్యనారాయణ తన ప్రియురాలి చేతిలో వున్న విషం బాటిల్ని లాక్కుని తానే తాగేశాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్ళినా ఉపయోగం లేకుండా పోయింది.