విశాఖ జీవీఎంసీ స్టాడింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం
posted on Aug 6, 2025 @ 8:49PM
విశాఖపట్నం మహా నగర పాలక సంస్థ ఎన్నికల్లో కూటమి పార్టీలు ఘన విజయం సాధించాయి. మొత్తం 10 స్థానాల్లో తొమ్మిది కైవసం చేసుకున్న కూటమి కేవలం ఒక్క స్థానం మాత్రం వైసీపీకి దక్కింది. అంటే 8 స్థానాల్లో టీడీపీ, ఒక్క స్థానంలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. వైసీపీ అతి కష్టం మీద ఈ సీటును గెలుచుకుందని తెలుస్తోంది. ఇక ఈ జీవీఎంసీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
ఈ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మొత్తం 92 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు అయితే గతేడాది స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో కూటమి క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ సారి మాత్రం కూటమి తొమ్మిది స్థానాలను కైవసం చేసుకుంది. జీవీఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను ఇప్పటికే కూటమిలోని పార్టీలు కైవసం చేసుకున్నా సంగతి తెలిసిందే.