జర్నలిస్ట్ సవాల్ కు సెహ్వాగ్ అదిరిపోయే రిప్లై..
posted on Sep 2, 2016 @ 2:18PM
భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు, బ్రిటిష్ జర్నలిస్ట్ పియర్స్ మోర్గాన్‌కి మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. రియో ఒలిపింక్స్ నేపథ్యంలో మొదలైన వీరిద్దరి మాటల యుద్దం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోసారి పియర్స్ మోర్గాన్ సెహ్వాన్ కు ట్వీట్ ద్వారా సవాల్ విసరగా..దానికి సెహ్వాగ్ కూడా దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చాడు. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటారా..?
‘నేను రూ.10లక్షలు పందెం కాస్తాను. భారతదేశం మరో ఒలింపిక్ స్వర్ణం గెలిచేలోపు ఇంగ్లాండ్ ప్రపంచకప్ నెగ్గుతుంది. సవాల్‌కి సిద్ధమేనా’ అంటూ ట్వీట్ చేశాడు. దానికి సెహ్వాగ్.. ‘కొందరిని దురదృష్టం మళ్లీ మళ్లీ వెంటాడుతూనే ఉంటుంది. వాళ్లు ఎంత ప్రయత్నించినా లాభం లేదు’ అంటూ ట్వీటాడు.
కాగా ‘120 కోట్ల జనాభా ఉన్న దేశం రియో ఒలింపిక్స్‌లో రెండు పతకాలు (అవి కూడా స్వర్ణాలు కావు) వచ్చినందుకు అంతలా సంబరాలు చేసుకుంటోంది. సిగ్గు చేటు కదా..?’ అని బ్రిటిష్ జర్నలిస్ట్ పియర్స్ మోర్గాన్ తొలుత గొడవకు తెరతీసిన సంగతి తెలిసిందే. దీనికి సమాధానంగా సెహ్వాగ్ ‘మేం చిన్ని చిన్ని సంతోషాలను కూడా గొప్పగా జరుపుకొంటాం. కానీ క్రికెట్‌ను కనిపెట్టిన ఇంగ్లాండ్.. ఇప్పటికీ ప్రపంచకప్ నెగ్గలేకపోయింది. అయితే ఇంకా ఆ దేశం క్రికెట్ ఆడుతుండటం సిగ్గుచేటు కదా..?’ అని రీట్వీట్ చేశాడు. మరి ఈ గొడవ ఎక్కడివరకూ వెళుతుందో...