రాములమ్మ బిజెపికి గుడ్ బై?
posted on Jul 26, 2023 @ 4:05PM
బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారని గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది.ఈ ప్రచారాన్ని విజయశాంతి తీవ్రంగా ఖండిస్తున్నారు. తాను పార్టీని వీడేది లేదని గతంలో స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికలపై ఆమె స్పందిస్తున్నారు. బిజెపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ట్వీట్స్ఈ మధ్య కాలంలో ఎక్కువగా చేస్తున్నారు. కానీ విజయశాంతి బీజేపీలోనే ఉంటానని చెబుతున్నారు. తాజాగా మణిపూర్ హింసపై విజయశాంతి స్పందించారు. విజయ శాంతి పెట్టే ట్వీట్ మోడీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. ప్రతి పక్ష కూటమి ఇండియా లోక సభలో అవిశ్వాస తీర్మానం పెట్టే నేపథ్యంలో విజయశాంతి ట్వీట్ కలకలం రేపింది.
పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని సోషల్ మీడియా విజయశాంతి ప్రచారం చేస్తున్నారు. ఇది సరికాదని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
రాములమ్మకు చాలా రోజుల తర్వాత మణిపూర్ అంశం గుర్తుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా మణిపూర్ అంశంపై సోషల్ మీడియాలో స్పందించారు. మణిపూర్‌లో చాలా రోజులుగా ఘోరాలు జరుగుతున్నా ఇప్పటి వరకూ ప్రభుత్వం స్పందించలేదు అని విజయశాంతి బాహాటంగానే స్పందించారు. దీంతో ఆమె ఆ ట్వీట్ వెనుక అసలు ఉద్దేశ్యం తన అసంతృప్తి అని వేరే చెప్పనక్కర్లేదు. బీజేపీ వర్గాలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల బీజేపీలో రాములమ్మ మాటే వినిపించడం లేదు. ఎవరూ పట్టించుకోవడం లేదు. చాలా మందికి పదవులు వస్తున్నాయి. అయినా రాములమ్మకు ఓ పదవి ఇద్దామని అధిష్టానం కూడా అనుకోవడం లేదు. సమావేశాలకూ పిలవడం లేదు. దీంతో అసంతృప్తికి గురవుతున్నారు. ఇటీవల కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వెళ్లినప్పటికీ అక్కడ ఎక్కువ సమయం వెచ్చించలేదు. వెంటనే వచ్చేశారు. ఎందుకంటేఅక్కడ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడన్నసాకు చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు బీజేపీ నేతే అన్న విషయం ఆమె మర్చిపోయారు. సొంత పార్టీ నేతలు విస్మయానికి గురయ్యేలా ప్రవర్తిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరేటప్పుడు ఆమె కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ పదవిలో ఉండేవారు. బీజేపీలో చేరాక అసలు ఆమె పదవి ఏంటో ఎవరికీ తెలియడం లేదు. సినీ గ్లామర్ తప్పితే పొలిటికల్ గ్లామర్ విజయశాంతికి లేదనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో బిజెపి టిక్కెట్ ఆమెకు దొరకడంం కష్టమే.