విజయలక్ష్మిని నిలదీసిన సుప్రీం కోర్ట్
posted on Jul 24, 2012 @ 2:21PM
అవినీతి నిరోథకశాఖ (ఎసిబి)ని వదిలేసి సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని ఆ కోర్టు న్యాయమూర్తులు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మిని నిలదీశారు. ఆమె తెలుగుదేశం పార్టీ అథినేత చంద్రబాబు, మరో 22మందిపై సుప్రీంకోర్టులో పిటీషను దాఖలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనిపై రెండుగంటల పాటు విచారణ నిర్వహించిన సుప్రీం ఇది రాజకీయదురుద్దేశ్యంతో కూడుకున్నదని ధృవీకరణకు వచ్చి పిటీషన్‌ను కొట్టేసింది.ఎసిబిని ఆశ్రయించాలని,అప్పటికీ న్యాయం జరగలేదంటే అప్పుడు పిటీషను వేసుకోవచ్చని సుప్రీం తేల్చింది.విజయలక్ష్మి తరుపున సీనియర్‌న్యాయవాదులు రాంజెత్మలానీ,ముకుల్ వాదించారు.
వీరి వాదనలో తొలుత ఇది రాజకీయ అంశంగా చూడొద్దన్నారు.అరెస్టులతో పని లేకుండానే జగన్ తరహాలో విచారిస్తే ప్రజాప్రయోజనకరంగా ఉంటుందని విశ్లేషించారు. దీనిలో అసలు ప్రజాప్రయోజనమేదీ లేదనీ,కోర్టు బయటే దీన్ని తేల్చుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలనకు తీసుకున్న సుప్రీం కిందకోర్టుల్లో విషయం ఎందుకు ప్రస్తావించలేదని విజయలక్ష్మిని ప్రశ్నించింది. ఆరోపణలు కూడా సరైన పద్దతుల్లో లేవని ఆగ్రహం వ్యక్తం చేసింది.చంద్రబాబు తరుపున అశోక్‌గంగూలీ,దివానీ వాదిస్తూ ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశ్యానికి సంబంధించిందని హైకోర్టు కూడా తేల్చిందని సుప్రీంకోర్టుకు వివరించారు. అవినీతికి సంబంధించిన అంశం కాబట్టి విజయలక్ష్మికి ఎసిబిని సంప్రదించాలని సుప్రీం కోర్టు సూచించింది.