మరో మలుపు తిరిగిన విజయ్ మాల్యా వ్యవహారం... వరుస ట్వీట్లు
posted on Mar 11, 2016 @ 9:43AM
వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టిన విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు దీనిపై పార్లమెంట్లో కూడా దుమారం రేగుతోంది. దేశం వీడి పారిపోయేందుకు ఎన్డీయే ప్రభుత్వం అనుమతించిందని ఒక పక్క ప్రతిపక్షనేతల ఆరోపణలతో పార్లమెంట్ అట్టుడుకుతోంది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తనపై వస్తున్న వార్తలకు స్పందించి.. తాను ఎక్కడికీ పారిపోలేదని, చట్టానికి కట్టుబడి ఉంటానని శుక్రవారం తెల్లవారుజామున వరుస ట్వీట్లు చేశారు.
అంతేకాదు మీడియాపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.. కావాలనే తనపై బురద జల్లుతున్నారంటూ.. ఆస్తులు ప్రకటించలేదని మీడియా గగ్గోలు పెడుతోంది.. అసలు ఆస్తులు చూపించకుండానే బ్యాంకులు రుణాలు ఎలా ఇచ్చారు... ఏదో టీఆర్పీ రేటింగ్ కోసం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.