బహిరంగగానే తిరిగేస్తున్న మాల్యా..
posted on Jul 9, 2016 @ 10:45AM
బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన విజయ్ మాల్యాను ఒకపక్క భారత ప్రభుత్వం ఇండియాకు రప్పించాలని తెగ ప్రయత్నాలు చేస్తుంటే.. మరోపక్క విజయ్ మాల్యా మాత్రం ఎటువంటి భయం లేకుండా బహిరంగంగానే తిరిగేస్తున్నారు. ఇండియా నుండి లండన్ పారిపోయిన మాల్యా అక్కడ బహిరంగగానే తిరుగుతున్నారు. మొదట కాస్త ఇబ్బంది పడి.. ఎవరికి తెలియకుండా క్లబ్బులు, పబ్బులకు వెళ్లే మాల్యా ఇప్పుడు అవేమి ఖాతరు చేయకుండా చాలా నార్మల్ బయటకు వస్తున్నారు. ఈమధ్య కాలంలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు తాజాగా ఓ మీడియా సమావేశంలో కూడా పాల్గొని ముచ్చటించారు. ఫార్ములా వన్ రేసుల్లో తన జట్టు ‘సహారా ఫోర్స్ ఇండియా’ జట్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అంతే కాదు ఆఖరిలో అంతా బాగానే ఉందని కూడా కామెంట్ చేశారు.
ఇదిలా ఉండగా భారత ప్రభుత్వం ఇప్పటికే మాల్యాను ఇండియా రప్పించడానికి ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగానే ఆయన పాస్ పోర్ట్ ను రద్దు చేసింది.. ఇంకా ఆయనను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా తేల్చేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ చేసింది. ఇంకా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఎన్ని చేసినా మాల్యా మాత్రం వాటన్నింటిని లెక్క చేయకుండా హాయిగా విదేశాల్లో ఎంజాయ్ చేసుకుంటూ తిరగడం గమనార్హం...