ప్రత్యేక హోదాపై వెంకయ్య ట్విస్ట్..
posted on Sep 8, 2016 @ 5:54PM
ఇప్పటివరకూ నాన్చి.. నాన్చి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పిందే చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని తెల్చిచెప్పారు. ఇంకా ఆయన ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడారు. వెంకయ్యనాయుడు ప్రస్తావించిన అంశాలు...
* ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తేల్చిచెప్పారు. హోదా ఇచ్చే అవకాశం లేనప్పుడు ప్రత్యేక ప్యాకేజీ కోరా.
* హోదాకు 14వ సంఘం ఆర్దిక సిపార్సు అడ్డంకిగా మారింది..14వ సంఘం ఆర్దిక సిపార్సు మేరుకు కేంద్ర విధుల్లో 42 శాతం రాష్ట్రాలకు బదాలాయించాలి.
* ఇంత భారీ ప్యాకేజీ ఇప్పటివరకూ ఏ రాష్ట్రానికి రాలేదు.. దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి ఇన్ని ప్రాజెక్టులు రాలేదు
* నా40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక సాయం ప్రకటించడంలో ఇంత స్పీడుగా ఎప్పుడూ జరగలేదు.
* ఏపీకి సాయంపై ఇప్పటికే ప్రకటించాం.. ఏపీ రెవెన్యూ లోటు భర్తీ చేశాం.. ఏపీ ప్రత్యేక సాయంపై కేంద్రం చిత్తశుద్దితో ఉంది.
* పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనధార..పోలవరం ఖర్చు 100 శాతం కేంద్రం భరించాలని వివరించాం..
* విభజనకు ఇప్పటి ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్సే కారణం..ఏపీకి అన్యాయం చేసినవాళ్లే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు..వాళ్లకు మాట్లాడే నైతిక హక్కులేదు.
* బెంగాల్, ఒడిశా, అసోం లకు రెవెన్యు లోటు ఉంది..ప్యాకేజీలపై పలు దఫాలుగా చర్చించాం.
* రైల్వేజోన్ ప్రకటన రాకముందే ఆందోళనలు సరికాదు. రైల్వేజోన్‌పైనా కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు.. కొత్త జోన్ విశాఖలోనా.. విజయవాడలోనా అన్న దానిపై రైల్వేశాఖ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
* విభజన చట్టంలో వాడిన పదాలవల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
* వెనుకబడిన జిల్లాలకు ఇప్పటికే రూ.700 కేట్లు..జాతీయ రహదారుల అభివృద్ధికి రూ. 64 వేల కోట్లు ఇచ్చాం.
* విభజన తర్వాత ఏపీకి ఎన్నో ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలు, సంస్థలు కేటాయించాం. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తక్కువ కాలంలోనే అనేక విద్యా సంస్థలు, కంపెనీలు నెలకొల్పింది ఏపీలో మాత్రమే.
* ప్రత్యేక దృష్టితోనే బెజవాడకు మెట్రో అనుమతి ఇచ్చాం.
*బకింగ్ హామ్ కెనాలో జలరవాణాతో ఏపీకి 392 కిలోమీటర్ల విస్తరణకు ప్రణాళికలు వేశాం.