గన్నవరం ఎమ్మెల్యే వంశీకి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్
posted on Oct 24, 2020 @ 11:14AM
ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. రోజువారీ కేసుల సంఖ్య కొంత తగ్గినట్టు కనపడినప్పటికీ మళ్ళీ పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది … అంతేకాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా మహమ్మారి మాత్రం వదలటం లేదు. అంతేకాకుండా సామాన్య ప్రజలు మాత్రమే కాకుండా ప్రజా ప్రతినిధులు కూడా దీని బారిన పడుతున్నారు.
ఏపీలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడగా… తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా వైరస్ సోకింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తేలటంతో 14 రోజుల పాటు హోంక్వారెంటైన్ లో ఉండనున్నట్లు తెలిపారు. అయితే ఎమ్మెల్యే వంశీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు. దీంతో గత నాలుగైదు రోజులుగా ఆయన్ను కలిసిన వారంతా టెస్ట్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.