పోలీసుల ఎదుట లొంగిపోనున్న వల్లభనేని వంశీ..
posted on Feb 15, 2016 @ 12:06PM
టిడిపి నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పైన పటమట పోలీసుల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు తన అనుచరులతో కలిసి లొంగిపోనున్నట్టు తెలుస్తోంది. కాగా విజయవాడ రామవరప్పాడులో భూసేకరణ కింద మున్సిపల్ అధికారులు అక్కడి పేదల పూరి గుడిసెలను తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో సమాచారం అందుకున్న వంశీ వెంటనే అక్కడికి చేరుకొని ముందస్తు నోటీసులు లేకుండా ఇళ్లను ఎలా తొలగిస్తారంటూ అధికారులను అడ్డుకొని.. బాధితుల పక్షాన మాట్లాడారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని.. గుడిసెవాసులతో కలిసి ఆయన నడిరోడ్డుపై ఆందోళనకు దిగారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పటమట పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. దీనికి వంశీ ఆగ్రహం వ్యక్తే చేస్తూ తానే స్వయంగా సరెండర్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే ఈరోజు పోలీసుల ఎదుట లొంగిపోనున్నట్టు సమాచారం.