తదుపరి సీజేఐ యు.యు.లలిత్
posted on Aug 5, 2022 @ 11:05AM
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తదనంతరం చేపట్టడానికి తగిన వ్యక్తిగా న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ పేరును కేంద్ర న్యాయశాఖ మంత్రికి సీజేఐ ఎన్.వి.రమణ ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన గురువారం తన ప్రతిపాదనతో కూడిన లేఖను కేంద్ర మంత్రికి ఎన్.వి.రమణ అందచేశారని సుప్రీం కోర్టు సమాచారం. ఆగష్టు 26వ తేదీన రమణ పదవీ విరమణ చేయనున్నారు.
న్యాయశాఖ ఆ లేఖను ప్రధానమంత్రి ఆమోదముద్ర పడితే.. ఆ ప్రతిపాదన రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్ర పతి అనుమతితో తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లలిత్ బాధ్యతలు చేపడతారు. రిటైర్ కానున్న సీజేఐ తన తర్వాత ఆ పదవిని చేపట్టేందుకు సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ న్యాయ మూర్తి పేరును సిఫారసు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్ ఎన్.వి. రమణ తర్వాత జస్టిస్ యు.యు.లలిత్ సీనియర్‌గా ఉన్నారు.
దేశంలోనే తీవ్రసంచలనం సృష్టించిన ట్రిపుల్ తలాక్ సహా అనేక కీలక కేసుల్లో తీర్పులు వెలువ రించిన ధర్మాసనాల్లో జస్టిస్ లలిత్ ఉన్నారు జస్టిస్ లలిత్ ఆగస్టు 27న ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే, ఆయన పదవీ కాలం మూడు నెలల్లోపే(74 రోజులు) ముగుస్తుంది. నవంబరు 8న ఆయన రిటైర్ అవుతారు.