కాలు జారిన బైడెన్
posted on Mar 20, 2021 @ 12:01PM
అమెరికా అధ్యక్షుడు మెట్లపై కాలు జారి పడ్డారు. విమానం ఎక్కుతుండగా తడబాటుకు లోనై.. కింద పడ్డారు. ఘటనలో ప్రెసిడెంట్ బైడెన్‌కు ఎలాంటి గాయాలు అవలేదు. ఆయన సుదర్షితంగానే ఉన్నారని వైట్‌హౌజ్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు కాలు జారి కింద పడటం మామూలు విషయమేమీ కాదు. అందుకే, ఈ న్యూస్ ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రముఖ వార్త అయింది.
అట్లాంటా రాష్ట్రంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల ఘటనల్లో ఎనిమిది మంది మృతిచెందారు. వీరిలో ఆరుగురు ఆసియా మహిళలు ఉన్నారు. ఆసియా కమ్యూనిటీని కలిసేందుకు.. వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్‌తో కలిసి అట్లాంటా వెళ్లేందుకు సిద్దమయ్యారు. 'ఎర్‌ఫోర్స్ వన్' ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కుతుండగా మెట్లపై కాలుజారి రెండుసార్లు కిందపడ్డారు. అనంతరం తనంతట తాను పైకి లేచి విమానంలోకి వెళ్లిపోయారు. ఈ ఘటనతో అధ్యక్షుడి సహాయ బృందం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.ఆయనకు ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.