ఒక్కసారే 150 మంది ఉగ్రవాదులు హతం..
posted on Mar 8, 2016 @ 1:57PM
ఉగ్రవాదులపై అమెరికా సైన్యం ఉక్కుపాదం మోపింది. నిన్న మొన్నటి వరకూ ఇరాక్, సిరియాల్లో ఉన్న ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసిన ఈ సైన్యం..ఇప్పుడు ఆఫ్రికా గడ్డ మీద వైమానిక దాడులు చేసింది. గత కొద్ది కాలంగా తమ దాడులతో సొమాలియాను వణికిస్తున్న అల్ షబాబ్ సంస్ధపై కూడా అమెరికా సైన్యం వైమానికి దాడులు చేసింది. దీంతో దాదాపు 150 మంది ఉగ్రవాదులు ఈ దాడుల్లో అంతమయ్యారని అమెరికా రక్షణ శాఖ విభాగం పెంటాగాన్ అధికారులు తెలిపారు.
కాగా సోమాలియా ప్రభుత్వ బలగాలు, ఆఫ్రికన్ యూనియన్ శాంతి పరిరక్షణా బలగాల మీద దాడులు చెయ్యడానికి 200 మంది ఉగ్రవాదులకు అల్ షబాబ్ శిక్షణ ఇస్తున్నదని అమెరికా సైన్యం గుర్తించి.. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న స్థావరాల మీద అమెరికా సైన్యం వైమానిక దాడులు చేసింది.