మాజీ మంత్రి ఉప్పునూతల ఇకలేరు
posted on Aug 3, 2013 @ 11:02AM
మాజీ మంత్రి, వైఎస్ఆర్. కాంగ్రెస్ పార్టీ నేత ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి కన్నుమూశారు. గత కొంత కాలంగా బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. 80 ఏళ్ల వయస్సు గల పురుషోత్తమరెడ్డికి సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇటీవల ఆయన కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి.. కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేసారు. రామన్నపేట నియోజకవర్గం నుంచి రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా, తెలంగాణ అభివృద్ధి మండలి ఛైర్మన్‌గా, ఎపిఐఐసీకి చైర్మన్‌గా ఉప్పునూతల పనిచేశారు. ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి మృతి పట్ల పలువురు దిగ్రాంతి వ్యక్తం చేశారు.