అవుట్‌సోర్సింగ్ వైద్య సిబ్బందిపై ప్రభుత్వ జులుం!
posted on Apr 10, 2020 @ 12:20PM
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల్లని రక్షించే ప్రయత్నంలో రాత్రింబవళ్ళు అహర్నిశలు పోరాడుతున్న వైద్య సిబ్బందికి అవసరమైన ఆరోగ్య కిట్ల కొరత వుంది. అయితే అవుట్‌సోర్సింగ్‌లో పనిచేసే వారిని అధికారులు కనీసం పట్టించుకోకుండా వారితో పనిచేయించుకుంటున్నారు. ముఖానికి మాస్క్ లాంటి కనీస వసతులు అడిగితే ఉద్యోగం నుంచి తీసివేశారంటూ 32 మంది నర్సలు రోడ్లమీదకు వచ్చి తమ గోడును వినిపిస్తున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి శ్రమిస్తున్నా యూపీ ప్రభుత్వం తమను విధుల నుంచి తొలగించిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాళ్ళు చేసిన పెద్ద తప్పు ఏమిటంటే వైద్యం చేయడానికి సామగ్రి తగిన కిట్లు ఇవ్వండి అని అడగడం. అదే పెద్ద తప్పు. తమపై జరుగుతున్న దాడి వైద్య సిబ్బంది ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.
పర్మినెంట్ ఉద్యోగులతో పాటు తాము పని చేస్తున్నప్పట్టికీ అవసరమైన ఆరోగ్య కిట్‌లను తమకు ఇవ్వడం లేదని అవుట్‌సోర్సింగ్ స్టాఫ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రతలేకుండా ఎలా పని చేయాలని ప్రశ్నిస్తే ఉద్యోగంలో నుంచి తీసివేశారని నర్సింగ్ స్టాఫ్ ఆరోపిస్తున్నారు.