No threat to UPA government says Antony

Defence Minister A. K. Antony and Union Minister of State K. V. Thomas have expressed confidence that the UPA Government would survive. Talking to visiting journalists from Kerala, Antony said that there was no threat to Government following withdrawal of support by Trinamool Congress. He did not elaborate. Thomas said that the national parties did not want an early election. The behaviour of Trinamool was unpredictable. It could not be said whether the party would offer support again.

బ్రెజిల్ నైట్‌క్లబ్‌లో మంటలకి 245మంది బలి

        బ్రెజిల్ నైట్‌క్లబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ బ్రెజిల్ శాంటా మారియా నగరంలో జనంతో కిక్కిరిసిన ఓ నైట్‌క్లబ్‌లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 245 మందికి పైగా మృతి చెందారు. షో కోసం వెలిగించిన నిప్పు వలన ఈ అగ్నిప్రమాదం జరిగిందని షో నిర్వాహకులు చెప్పారు. ఈ సమయంలో క్లబ్‌లో 500 మంది దాకా ఉన్నారు.   ఇప్పటిదాకా 180 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. దట్టమైన మంటలు, పొగలతో కమురుకుపోయిన క్లబ్ భవంతి నుంచి మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు.  అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే ప్రాణాలు కాపాడుకునే క్రమంలో తీవ్ర తొక్కిసలాట చేసుకుందని, తద్వారా మృతుల సంఖ్య భారీగా పెరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదవిషయం తెలిసిన వెంటనే.. అధ్యక్షుడు దిల్మా రౌసెఫ్ చిలీ పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని స్వదేశానికి చేరుకున్నారు. కాగా, మరో ఏడాదిలో బ్రెబిల్‌లో అంతర్జాతీయ సాకర్ పోటీలు జరగాల్సి ఉంది. తాజా దుర్ఘట న ప్రభావం ఆ పోటీల నిర్వహణపై పడొచ్చునని అధికారులు ఆందోళన చెందుతున్నారు. 

రాష్ట్ర ప్రజలపై తెలంగాణ ఎఫెక్ట్

    తెలంగాణాపై ఇప్పటికిప్పుడు పరిష్కారం అసాద్యం అని గులాం నబీ ఆజాద్ ఈ రోజు తేల్చి చెప్పేయడంతో నెల రోజుల సస్పెన్స్ త్రిల్లర్ సీరియల్ పూర్తయిపోయింది. ఇక, రాజకీయ పార్టీల మద్య మాటల యుద్దాలు తరువాత దశలో పార్టీ ఫిరాయింపులు, ఎన్నికలు, మెజార్టీ వగైరాలు మొదలుకానున్నాయి. ఒక విదంగా చెప్పాలంటే రాజకీయ పార్టీలు ఆన్ డ్యూటీలో ఉంటూ తమ ప్రయోజనాలకి అనుగుణంగా పావులు కదుపుతుంటే, విద్యార్దులు, ఉద్యోగులు ఇందులో నష్టపోనున్నారు. విద్యార్దులు విద్యా సంవత్సరాలు కోల్పోతే, నెల జీతం మీద బ్రతులు వెళ్లదీసే ఉద్యోగులు సమ్మెలు చేసి ఆర్దికంగా ఇబ్బందుల్లో పడతారు. రాష్ట్ర విభజన జరిగినా జరుగాకపోయినా రాజకీయ నేతలకి పెద్ద తేడా ఉండదు. గానీ, వారి వెంట తిరిగినందుకు విద్యార్దులు, ఉద్యోగులు మాత్రం నష్టపోక తప్పదు. ఇది చేదు నిజం అని తెలిసినప్పటికీ భావోద్వేగాలు వాటిని కనబడనీయవిప్పుడు.   ఇక, నేటి నుండి తెలంగాణాలో రేగే అలజడి ప్రభావం రాష్ట్ర ప్రజలందరిపైన కూడా పెను ప్రభావం చూపనుంది. ఇప్పటికే, రాష్ట్ర పరిస్థితి దీనావస్థలో ఉంది. అది రేపటి నుండి మరింత దిగజారుతుంది. ముఖ్యంగా సామాన్యులు, మద్య తరగతి వర్గాలు, వ్యాపారస్తులపై ఈ ప్రభావం అధికంగా ఉండబోతోంది. కరెంటు కష్టాలు, ధరల మోతలు మరింత పెరిగి ప్రజల బ్రతుకులు భారంగా మార్చే అవకాశం ఉంది. ఇప్పటికే పరిశ్రమలు పక్క రాష్ట్రాలకి తరలిపోతున్నాయి. కరెంటు కష్టాలతో ఉన్న కొద్ది పాటి పరిశ్రమలు మూతపడుతుండటంతో కార్మికులు ఉపాది కోల్పోతున్నారు. కరెంటు సమస్య పెరిగిన కొద్దీ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. దీనితో, ఇప్పటికే చితికిపోయిన సామాన్య, మద్య తరగతి కుటుంబాలు వీదినపడే ప్రమాదం ఉంది.   కరెంటు సమస్యలు మరింత పెరిగితే వ్యవసాయం కుంటుపడి అది ఆహార ధాన్యాలు, పప్పులు, కూరగాయాలపై కూడా పడుతుంది. ఈ ప్రభావం సమాజం మీద పడక తప్పదు. రాష్ట్రానికి గుండెకాయవంటి హైదరాబాదు స్తంబిస్తే యావత్ రాష్ట్రం మొత్తం విలవిలలాడక తప్పదు.   రాష్ట్రంలో రాజాకీయ పార్టీలన్నీ విజ్ఞతతో సమస్య పరిష్కారానికి క్రుషిచేసినట్లయితే ఈ పెను సవాళ్ళను అవలీలగా అధిగమించవచ్చును.      

త్వరలో మళ్ళీ మరో ప్రస్తానం

  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల మోకాలి శస్త్రచికిత్సకోసం మద్యలో నిలిపివేసిన తన పాదయాత్రను మళ్ళీ వచ్చేనెల మొదటివారం నుండి ప్రారంబించవచ్చునని ఆ పార్టీ నేత వాసిరెడ్డి పద్మ ఈ రోజు మీడియాకి తెలియజేసారు. వైద్యులు ఊహించినదానికంటే త్వరగానే ఆమె కోలుకోన్నారని, అందువల్ల ఆమె తన పాదయత్రని త్వరలో ప్రారంబించదానికి వైద్యులు కూడా అనుమతినీయడంతో, ప్రస్తుతం ఫిజియో థెరపీ తీసుకొంటూ నడక ప్రాక్టీసు మొదలుపెట్టినట్లు సమాచారం. అయితే, మారిన రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు ఆమె తెలంగాణాలో పాదయాత్ర చేస్తారా లేక వేరే చోట నుండి మొదలు పెడతారా అనేది ఇంకా తెలియలేదు.   జనవరి 28వ తేదిన తెలంగాణాకి అనుకూలంగా ప్రకటన వచ్చే అవకాశాలు సన్నగిల్లినందున ఆగ్రహావేశాలతో ఉండే తెలంగాణావాదులు, అఖిలపక్షంలో తెలంగాణాకి వ్యతిరేఖంగా లేఖ ఇచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన షర్మిల పాదయాత్రను సజావుగా సాగనియకపోవచ్చును. మరి అటువంటప్పుడు ఆమె అక్కడి నుండి పాదయాత్ర ప్రారంబిస్తారా లేక వేరే ప్రాంతాన్ని ఎంచుకొంటారా అనే విషయం తెలుసుకోవాలంటే మరో రెండు మూడు రోజులు వేచి చూడాలి.   అయితే, ఇటువంటి క్లిష్ట సమయంలోనే ఆమెను మళ్ళీ పాదయాత్ర మొదలుపెట్టించడంలో కారణం ఏమిటని ఆలోచిస్తే, తమ పార్టీపై తెలుగుదేశం, కాంగ్రెస్, తెరాస పార్టీలు జరుపుతున్న దుష్ప్రచారం అడ్డుకోవడం ఒక కారణం అయితే, అటు, తెలంగాణాలోనూ ఇటు ఆంధ్ర ప్రాంతంలోనూ అప్రతీహతంగా సాగిపోతున్న చంద్రబాబు పాదయాత్ర వల్ల తమ పార్టీకి హాని జరగకుండా కాపాడుకోవడానికి అయిఉండవచ్చును. ఆమె పాదయాత్ర తెలంగాణాలో కాకుండా మరెక్కడి నుండి మొదలుపెట్టినా అవే కారణాలుగా భావించవచ్చును.   గానీ, ఆమె తెలంగాణాలోనే తిరిగి పాదయత్ర మొదలు పెడితే మాత్రం దాని వెనుక మరిన్ని బలమయిన కారణాలు చాలానే ఉండవచ్చును. ఆగ్రాహవేశాలతో ఉన్న తెలంగాణా నేతలకు ఆమె పాదయాత్ర ఒక సవాలు వంటిదని చెప్పవచ్చును. వారిని అటువంటి తరుణంలో డ్డీ కొనడం ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి క్లిష్ట సవాళ్లనయినా ఎదుర్కోవడానికి సిద్దం అని సంకేతం ఇచ్చినట్లు అవుతుంది.

కృష్ణా జిల్లాలో పైలాన్ ఆవిష్కరించిన చంద్రబాబు

  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 117 రోజులు పాదయాత్ర పూర్తీ చేసిన సందర్భంగా ఈ రోజు కృష్ణా జిల్లా పరిటాలలో స్థానిక పార్టీ నేతలు నిర్మించిన 117 అడుగుల ఎత్తున్న పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపకులయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జన్మించిన కృష్ణా జిల్లాలో పైలాన్ అవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.   చంద్రబాబు ఆరోగ్యం, వయసు ఇతర శారీరిక సమస్యలను దృష్టిలోఉంచుకొని, ముందు నిర్ణయించినట్లుగానే జనవరి 26వ తేదీతో పాదయాత్ర ముగింపు పలుకుతారని అందరూ ఊహించినపటికీ అయన తన పాద యాత్రను కొనసాగించాలని నిర్ణయించుకొన్నారు. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు అయన వ్యక్తిగత వైద్యులు కూడా పాదయాత్రకు ముగింపు ముగింపు పలికి ఇక విశ్రాంతి తీసుకోమని కోరినపటికీ, ప్రజల పడుతున్న కష్టాలతో పోలిస్తే తన సమస్యలు చాల చిన్నవని, అందువల్ల తన పాదయాత్ర కొనసాగించదలుచుకొన్నానని ఆయన స్పష్టం చేశారు. తన శరీరం ఆరోగ్యం సహకరించినంత కాలం ముందుకు సాగాలని కోరుకొంటున్నట్లు తెలిపారు.

శైలజ ఉవాచ: కోరికలే దుఃఖమునకు మూల కారణం

  అలనాడు బోధీ వృక్షం క్రింద తపస్సుచేసిన గౌతమ బుద్దుడు “కోరికలే దుఃఖమునకు మూల కారణం” అని కనుగొనగలిగేడు. ఇప్పుడు తెలంగాణాలో దుఃఖానికి, అశాంతికి కేసీర్ వంటి నేతల కోరికలే కారణమని మంత్రి వర్యులు శైలజానాథ్ తెలిపారు.   ఈ రోజు రాజమండ్రీలో పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ నిర్వహించిన జై ఆంధ్రా మహాసభలో ప్రసంగిస్తూ శైలజానాథ్ “ మొదట ఇరుగుపొరుగులను చూసి అసహనం ఏర్పడుతుంది అది క్రమంగా కోపంగా మారి చివరికి ద్వేషంగా మారినప్పుడు ఈ విధమయిన ఉద్యమాలు పుట్టుకొస్తాయి. ఒకప్పుడు తెలంగాణా ప్రజలను రజాకార్లు, నవాబులు, పెత్తందారులు పీడించుకు తినేవారు. గానీ, ఎప్పుడయితే రాష్ట్రం సమైక్యంగా తయారయిందో అప్పటి నుండి అటువంటి వారు క్రమంగా కనుమరుగయిపోయారు. అంతవరకూ పీడనకు గురయిన పేదలు, దళితులు, బలహీన వర్గాలు, పేద ప్రజలు స్వేచ్చా వాయువులు పీల్చుకోగలిగేరు. నాటి నుండే వారి జీవితాలలో మార్పు వచ్చింది. ఇదంతా రాష్ట్రం సమైక్యంగా ఉన్నందున సాధ్యమయింది. ఇప్పుడు మళ్ళీ దొరల అహంకారం కలిగిన నేతలు కొందరు రాష్ట్రాన్ని విభజించి మళ్ళీ పాత రోజుల్లోకి ప్రజలను నెట్టాలని చూస్తున్నారు. ఈ విషయాన్నీ తెలంగాణా ప్రజలందరూ గమనించాలి. ఉద్యమాలను నడుపుతున్న వారి నాయకుల ఉద్దేశాలను కూడా గమనించాలి. రాష్ట్రం సమైక్యంగా ఉన్నపుడే ఎక్కడయినా అభివృద్ధి సాద్యం,” అని అన్నారు.

కేసీఆర్ పై నిప్పులు.. జై ఆంధ్రప్రదేశ్‌లో ఉండవల్లి గర్జన

        రాజమండ్రిలో జరుగుతున్న జై ఆంధ్రప్రదేశ్ సభలో పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కేసీఆర్ పై మండిపడ్డారు. తెలంగాణ నాయకులు కోరినందువల్లే ఆ రోజున ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిందని స్పష్టం చేశారు. ఎవ్వరూ మాయమాటలు చెప్పి తెలంగాణను కలుపుకోలేదు అని ఆయన వివరించారు. తెలంగాణ నాయకులు అసందర్భ ప్రేలాపనలు ఆపి చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని, రెచ్చగొట్టే ప్రకటనలతో విద్వేషాలను రగిలించరాదని ఆయన పిలుపు ఇచ్చారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు పిట్టకథలు చెపుతూ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. స్వాతంత్య్రం అనంతరం నిజాం ప్రభువు భారత దేశంలో ముందు కలవలేదు, ఆ తర్వాత తల వంచి భారత ప్రభుత్వానికి లొంగిపోయారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిజాం కాలం గురించి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఎంతో పొగుడుతూ గర్వంగా చెబుతుంటారని, కాని నిజాం కాలంలో ప్రజలకు కష్టాలే మిగిలినవి తప్ప నైజాం నవాబు గొప్పవాడేం కాదని ఆయన వివరించారు. తెలంగాణ ఉద్యమ నేతలు అసందర్భ ప్రేలాపనలు ఆపి చరిత్ర తెలుసుకోవాలని, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది నిజాం నవాబు కాదని ఆయన చెప్పారు. ఆనాటి జవహర్‌లాల్ నెహ్రూ మాటలను వక్రీకరించి వ్యాఖ్యానాలు చేస్తున్న తెలంగాణ ఉద్యమ నాయకులు చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆయన నిప్పులు చెరిగారు. జై ఆంధ్రప్రదేశ్ సభలో ఉండవల్లి ప్రసంగం సుదీర్ఘంగా సాగింది. మధ్య మధ్యలో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కె. చంద్రశేఖర రావు, కె. తారక రామారావు, హరీశ్‌రావు, ప్రొఫెసర్ కోదండరాంల ఉపన్యాసాల క్లిప్పింగులను చూపిస్తూ ఉండవల్లి ఈ ఉపన్యాసాలు రెచ్చగొట్టడం కాక మరేమిటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో తలలు తెగిపడతాయని స్పీచ్‌లు ఇచ్చారని, బట్టలు విప్పి కొట్టాలని పిలుపు ఇచ్చారని, కాని అదేం భాష అని ఆయన నిలదీశారు.  

తెలంగాణా ఉద్యమనాయకులను తప్పు పట్టిన ఉండవల్లి

        కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు ఉండవెల్లి అరుణ్ కుమార్ రాజమండ్రీలో నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ మహాసభలో మాట్లాడుతూ కేసీర్, ప్రొఫెసర్ కోదండరాం తదితరులను ఉద్యమం పేరిట ప్రజలమధ్య విద్వేషాలు రగిలిస్తున్నందుకు తప్పుపట్టారు. వారు తమ స్వార్ద రాజకీయ ప్రయోజనాలకోసమే తెలంగాణా ఉద్యమాలు మొదలు పెట్టారని ఆయన ఆరోపించారు. ప్రజలను,రాజకీయ నాయకులను నరుకుతాము, తరిమికొడతామంటూ భయబ్రాంతులకు గురిచేసి ఉద్యామాలు నడిపిస్తున్నారని ఆరోపించారు.     సముద్రంలో వృధాగా కలిసిపోతున్ననీటిని పంటలకు ఉపయోగపడేవిదంగా తెలంగాణా దిగువనున్నపోలవరం వద్ద ప్రాజెక్టు కడితే, ఎగువనున్న తెలంగాణాకు ఏ విదంగా నష్టం వాటిల్లుతుందో తెలుపమని సవాలు విసిరారు. పోలవరం వల్ల నష్టపోయే గిరిజనుల గురించి కేసిర్ కి ఎంత తాపత్రయం ఉందో తమకీ అంతే ఉందని, నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉంటే అందరూ కలిసి వారి జీవితాలు చక్క దిద్దేందుకు కలిసి కృషిచేద్దామని అయన అన్నారు. ఉండవల్లి ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణా మూడు ప్రాంతాలలో జరిగిన అభివృద్ధి వివరాలను గణాంకాలతో సహా సభికులకి వివరించారు.     శాసనసభలో అధికార పార్టీ ప్రతినిధిగా ఉన్నంతకాలం గుర్తుకురాని తెలంగాణా, తరువాత ఎందుకు గుర్తుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కేసీర్ చేపట్టిన ఉద్యామలవల్లనే అమయకులయిన విద్యార్దులు చనిపోతుంటే అందుకు తమని నిందించడం ఏమీ న్యాయమని ఆయన ప్రశ్నించారు. చనిపోయినవారు ఎవరి పిల్లలయినా అందరికీ బాధ కలుగుతుంది, అందుకు బాష, ప్రాంతం అడ్డురావని ఆయన అన్నారు.     కేసీర్, ప్రొఫెసర్ కోదండరాం వివిధ సభలలో ఆంద్ర ప్రాంతవాసులను, మంత్రులను అవహేళను చేస్తూ, బెదిరిస్తూ మాట్లాడిన విడియో క్లిప్పింగులను సభికులకు ప్రదర్శించి చూపిన ఉండవల్లి, ఆంద్ర ప్రజలను ఈ విదంగా అవమానించడం ఏమి సబబు అని ప్రశ్నించారు. తమ స్వార్ద రాజకీయ ప్రయోజనాలకోసమే మొదలు పెట్టిన తెలంగాణా ఉద్యమంలో అమాయకులు, సామాన్యులు సమిదలయి రాలిపోతుంటే ఆయన మాత్రం తన ఉద్యమం కొనసాగించడం దారుణం అని అన్నారు. అయన చెప్పటిన ఉద్యమంలో అయన బంధువులుగానీ, పార్టీకి చెందిన నేతలకి గానీ ఒంటి మీద ఈగ కూడా వాలకపోయినా, అమాయకులయిన విద్యార్దులు మాత్రం అసువులు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.     రాష్ట్ర ప్రజలు కలిసి అభివృద్ధి సాదించాలే తప్ప విడిపోయి బావుకోనేది ఏమి ఉండబోదని ఆయన అన్నారు. రాహుల్ గాందీ మొన్న చింతన శిబిర్ లో చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ ఇంట కాలానికి దేశాన్ని సవ్య దిశలో తీసుకుపోగల నాయకుడు దొరికాడని మెచ్చుకొన్నారు.

ఉగ్రవాది డేవిడ్ హెడ్లీకి 35 ఏళ్లు జైలు

      ముంబై పై దాడులకు సంబంధించిన ఉగ్రవాదికి అమెరికా కోర్టు శిక్ష విధించింది. ముంబై దాడుల సూత్రధారి డేవిడ్ హెడ్లీకి 35 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ అమెరికాలోని షికాగో కోర్టు తీర్పు చెప్పింది. గత ముంబై దాడి ఘటనలో కీలకపాత్ర పోషించి విధ్వంసానికి కారణమైన హెడ్లీకి 35 ఏళ్ల జైలు శిక్షను విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. 26/11 ముంబై దాడుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న హెడ్లీపై అభియోగాలు రుజువుకావడంతో శిక్షను ఖరారు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. లష్కర్ ఇ తోయిబాకు హెడ్లీ సహకారమందిచినట్లు రుజువు కావడంతో శిక్షను అమలు చేయాల్సిదింగా ఆదేశాలు జారీ చేసింది. చేసింది.

కాంగ్రెస్ అత్యుత్సాహమే కొంప ముంచిందా?

  గత నెల అఖిలపక్ష సమావేశం తరువాత నుండి, మిగిలిన వారి సంగతి ఎలాఉన్నా రాష్ట్రంలో తెలంగాణా, సీమంద్రాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రదర్శించిన అత్యుత్సాహమే పరిస్థితిని మరింత క్లిష్ట పరిచిందని చెప్పక తప్పదు. ఒక కీలకమయిన నిర్ణయం తీసుకొంటున్న తరుణంలో ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాలవారు అత్యంత బాధ్యతగా మెలిగి సంయనం పాటించకపోగా, తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసారు.   ప్రతీ చిన్న విషయానికి అధిష్టానం నిర్ణయం కోసం డిల్లీ వైపు చూసే కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో మాత్రం పార్టీ గౌరవ ప్రతిష్టలను మసకబారుస్తూ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రజలకి మార్గ దర్శనం చేయవలసిన నేతలే ప్రజలలో భావోద్వేగాలను రెచ్చగొడుతూ, వాటిని అడ్డుపెట్టుకొని గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారు.   తీవ్రమయిన ఒత్తిళ్ళ మద్య కీలక నిర్ణయం తీసుకోబోతున్న కాంగ్రెస్ అధిష్టానం సైతం తన నేతలను కట్టడి చేకుండా అలసత్వం ప్రదర్శించి సమస్యని చేజేతులా పీకలమీదకు తెచ్చుకొంది. వారిని ముందే నియత్రించి ఉంటే ఖచ్చితం రాష్ట్రంలో ఇంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడి ఉండేది కాదు అని చెప్పవచ్చును.   కాంగ్రెస్ పార్టీలో ఈ రెండు వర్గాలమద్యనే ఐక్యత లేనప్పుడు ఇతరపార్టీలను నిందించి ఏమి ప్రయోజనం. మన బంగారం మంచిదయితే అన్నట్లుగా కాంగ్రెస్ నేతలు సంయమనం కోల్పోయినప్పుడు, తెరాస వంటి పార్టీలు మాత్రం తమ రాజకీయ ప్రయోజనాలను ఎందుకు వదులుకొంటాయి?   ఒక సంక్లిష్టమయిన సమస్యను పరిష్కరించవలసిన మన రాజకీయ పార్టీలన్నీ కూడా తమ స్వార్ద రాజకీయ ప్రయోజనాలకోసం ఆడిన ఈ ఆటలో ప్రజలే అంతిమంగా నష్టపోతున్నారు. నిజం చెప్పాలంటే రాజకీయ అపరికత్వతతో కూడిన స్వార్ద రాజకీయాలే నేటి ఈ పరిస్థితికి కారణమని చెప్పవచ్చును.

ఢిల్లీ గ్యాంగ్ రేప్: జ్యోతి సింగ్ కి 73శాతం మార్కులు

      ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురై 13 రోజుల పోరాటం అనంతరం ప్రాణాలు వదిలిన ఫిజియోతెరపీ విద్యార్థిని జ్యోతి సింగ్ పాండే చదువులో ఎంత చురుకో తెలియజేసే రుజువిది. ఫిజియోథెరపీ కోర్సు నాలుగో సంవత్సరం పరీక్షల్లో జ్యోతి సింగ్ పాండే కు 72.7 శాతం మార్కులు వచ్చాయి. ఉత్తరాఖండ్‌లోని హేమవతి బహుగుణ గర్వాల్ విశ్వవిద్యాలయం పరీక్షా ఫలితాలు వెల్లడించగా.. జ్యోతి సింగ్ పాండే కు 1100కి 800 మార్కులు వచ్చినట్లు వెల్లడైంది. సబ్జెక్టుల్లో ఆమె ప్రతిభ అసాధారణమైందని ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ చెప్పారు. ఇంత మంచి మార్కులు తెచ్చుకున్న అమ్మాయి.. ఇప్పుడీ లోకంలో లేకపోవడమే అందరినీ కలచి వేస్తోంది.