ప్రియాంక అరెస్టుతో యూపీలో హై టెన్షన్! దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు..

ఉత్తర్ ప్రదేశ్ లో హై టెన్షన్ కనిపిస్తోంది. రైతుల ఉద్యమం హింసాత్మకంగా మారడంతో విపక్షాలు తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్నాయి. కాంగ్రెస్ యువ నేత ప్రియాంక గాంధీ పోరాటంతో యూపీ పోలీసులకు చుక్కలు కనిపిస్తున్నా. ఆదివారం మొద‌లైన హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు సోమవారం మరింత ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీశాయి. కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత‌, ఆ పార్టీ యూపీ ఇంచార్జీ ప్రియాంకా గాంధీ వాద్రాను పోలీసులు అరెస్ట్ చేయడం మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది. తీవ్ర వాగ్వాదం నేప‌థ్యంలో ప్రియాంకా గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్‌కు ముందు ప్రియాంక గాంధీపై పోలీసులు చేయి చేసుకున్నార‌న్న వాద‌న‌లూ క‌ల‌క‌లం రేపుతున్నాయి. పోలీసుల తీరుపై నిర‌స‌న తెలిపిన ప్రియాంకా గాంధీ.. త‌న‌ను ఉంచిన జైలు గ‌దిని స్వ‌యంగా చీపుపు ప‌ట్టి ఊడ్చిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఈ వీడియోల‌ను చూసిన కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్డెక్కుతున్నారు. 

ఆదివారం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ల‌ఖీంపూర్ భేరీలో ప‌ర్య‌టించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనలో  రైతులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో మంత్రి కారు రోడ్డు పక్కనే ఆందోళనలు చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు దుర్మరణం చెందడంతో లఖీంపూర్‌ ఖేరి జిల్లాలో హింసాకాండ ప్రారంభమైందని అక్కడి రైతులు చెబుతున్నారు. ఈ దుర్ఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో వాహనాలు దగ్ధం చేయడం వంటి హింసాత్మక దృశ్యాలు కనిపించాయి.

ఈ ఘటనలో చ‌నిపోయిన‌ బాధిత రైతుల కుటుంబాలను పరామర్శించడానికి ప్రియాంక గాంధీ సోమవారం బయలుదేరారు. సీతాపూర్ రాగానే అక్కడ పోలీసులు ఆమె కాన్వాయ్ ను అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులపై ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు. “మీరు చంపిన వ్యక్తులు, మీరు సమర్థిస్తున్న ప్రభుత్వం కంటే నేను ముఖ్యం కాదు కదా! మీరు నాకు లీగల్ వారెంట్, లీగల్ ప్రాతిపదిక ఇచ్చి అడ్డుకోండి. లేదంటే నేను ఇక్కడి నుంచి కదలను. మీరు నన్ను తాకడానికి కూడా వీలు లేదు” అని సీతాపూర్‌లో ఆమె పోలీసులపై ధ్వజమెత్తారు. పక్కకి జరగాలంటూ ఒక మహిళా పోలీసు ఆమెను అభ్యర్థించిన్నట్లు సమాచారం. అదే స‌మ‌యంలో ప్రియాంక గాంధీ వాద్రాను సీతాపూర్ పోలీస్ లైన్‌కు తీసుకువెళుతున్నారని.. ప్రజలు అక్కడికి రావాలని యూపీ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ ఒక వీడియోను ట్వీట్ చేసింది. వారెంట్ లేదా లీగల్ ఆర్డర్‌ ఇచ్చి తనని అడ్డుకోవాలంటూ ఆమె పోలీసులకు తెలిపారు. ఒకవేళ మీరు నన్ను ఆ కారులో ఎక్కించుకుంటే.. మీరు నన్ను కిడ్నాప్ చేసినట్లు కేసు ఫైల్ చేస్తానని ఆమె హెచ్చరించారు. 

ఈ కేసు అనేది మొత్తం పోలీసులపై కాదు కానీ తనని అడ్డుకునే ఒక్క పోలీస్ పైనే పెడతానని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఆమె పక్కన కాంగ్రెస్ నాయకుడు దీపేందర్ హుడా ఉన్నారు. ప్రియాంక గాంధీ వాద్రాపై ఎలా చేయి చేసుకుంటారని అతడు ఒక పోలీసును ప్రశ్నించారు. ఈ ఉద్రిక్తతలలో ప్రియాంకపై పోలీసులు చెయ్యి చేసుకున్నారా లేదా అనేది స్పష్టంగా తెలియరాలేదు. కానీ హుడా మాట్లాడుతూ.. పోలీసుల భౌతిక దాడి గురించి తాను సాక్ష్యం ఇమివ్వబోతున్నానని.. వారి అరాచకాలు కళ్లారా చూశానని చెప్పారు. ఇంతలో ఒక పోలీస్ అధికారి హుడాని ఒక కారులోకి తరలించే ముందు గట్టిగా తోస్తూ తీసుకెళ్లారు. ఇది చూసి.. “మళ్లీ మొదలెట్టారా.. ఆపండి” అని ప్రియాంక గాంధీ వాద్రా ఆగ్రహం వెళ్లగక్కారు.

ఈ క్ర‌మంలో పోలీసుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ప్రియాంకా ఒక మహిళతో కూడా మాట్లాడలేని మీరు హుడాని కొడతారా? అంటూ జోక్యం చేసుకున్నారు. అనంతరం హుడాపై దాడి చేయనివ్వకుండా పోలీసుల బృందానికి అడ్డుగా నిలబడ్డారు. వారెంట్ లేదా లీగల్ ఆర్డర్‌ ఇచ్చి తమని అడ్డుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ఇలా ఇరు వ‌ర్గాల మధ్య తీవ్ర‌స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకోగా.. పోలీసులు ప్రియాంకాను అదుపులోకి తీసుకున్నారు. ఆ త‌ర్వాత స‌మీపంలోని పోలీస్ లైన్‌కు త‌ర‌లించారు. అక్క‌డ ఆమెను ఓ గ‌దిలో ఉంచారు. అయితే ఆ గ‌ది అపరిశుభ్రంగా ఉన్న వైనాన్ని గ్రహించిన ప్రియాంకా అక్క‌డే ఉన్న చీపురుని చేత‌బ‌ట్టి గ‌ది మొత్తాన్ని శుభ్రంగా ఊడ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఈ వీడియో చూసిన మరుక్ష‌ణ‌మే ప్రియాంకా సోద‌రుడు రాహుల్ గాంధీ ఆమెకె మ‌ద్ద‌తుగా ఓ ట్వీట్ చేశారు. “ప్రియాంక.. మీరు వెనక్కి తగ్గరని నాకు తెలుసు.. మీ ధైర్యానికి వారు ఆశ్చర్యపోయారు. న్యాయం కోసం జరిగే ఈ అహింసా పోరాటంలో మనం ఈ దేశ అన్నదాతలు గెలిచేలా చేయగలం” అని రాహుల్ గాంధీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

వాస్తవ వేదిక.. వారికే కాంట్రాక్టులు.. అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా

ఆంధ్రప్రదేశ్ లో అపారమైన ఖనిజ సంపద ఉంది. ముఖ్యంగా కడప జిల్లాలోని మంగంపేట బారైటీస్ ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత కలిగినవి. అయితే, ఈ సంపద రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాల్సింది పోయి, రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్ల పరమవుతోందని 'జమీన్ రైతు' ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ ఆరోపించారు. తెలుగువన్ ఎండి కె. రవిశంకర్ తో  కలిసి  పంచుకున్న వాస్తవ వేదికలో ఆయన బైరైటీస్ దోపిడీపై పలు సంచలన విషయాలు వెల్లడించారు.  రాయలసీమ ఆర్థిక వ్యవస్థలో మంగంపేట బారైటీస్ కీలక పాత్ర పోషిస్తాయి. అందులో సందేహం లేదు. గతంలో ఇక్కడ జరిగిన విపరీతమైన అవినీతిని అరికట్టడానికి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఈ మైనింగ్‌ను  ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి అప్పగించారు.  కానీ.. ప్రస్తుతం పరిస్థితులు మళ్ళీ మొదటికి వచ్చాయన్నారు డోలేంద్ర ప్రసాద్.   మంగంపేట బారైటీస్ విషయంలో గత జగన్ సర్కార్ చేసిన తప్పులనే ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నదని విమర్శించారు.   అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక టన్ను బారైటీస్ ధర సుమారు 140 డాలర్లు అంటే బారత కరెన్సీలో   12,704.79 రూపాయలు ఉంటే, ఇక్కడి కాంట్రాక్టర్లకు కేవలం  12.78 డాలర్లు అంటే 1,160 రూపాయలకే కట్టబెడుతున్నారని డోలేంద్ర ప్రసాద్  వివరించారు.  ఎంపరాడా  వంటి సంస్థలకు మాత్రమే టెండర్లు దక్కేలా నిబంధనలను రూపొందించడమన్నది పక్కగా కుమ్మక్కై చేస్తున్న పనిగా ఆయన అభివర్ణించారు.   ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. తెలుగు రాష్ట్రాల్లో టెండరింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనీ,  కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా, విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు ఇలా ప్రతి రంగంలోనూ నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా తెరిచారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.  ఈ దోపిడీలో అధికార, విపక్ష పార్టీలు, బ్యూరోక్రసీ, కొన్ని మీడియా సంస్థలు కూడా భాగస్వాములుగా ఉన్నాయన్నారు.  ఒక చిన్న స్థాయి గుమాస్తా దగ్గరే కోట్లాది రూపాయల ఆస్తులు దొరుకుతున్నాయంటే, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల ఆస్తులు ఏ స్థాయిలో ఉండి ఉంటాయో అర్ధం చేసుకోవచ్చని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు.  బారైటీస్ మాత్రమే కాకుండా, ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతంలోని బీచ్ శాండ్ అలాగే అత్యంత విలువైన రేర్ ఎర్త్ ఖనిజాలు కూడా లూటీ అవుతున్నాయన్నారు.    చైనా నేడు ఈ రేర్ ఎర్త్ ఖనిజాలతోనే అమెరికా వంటి దేశాలను గడగడలాడిస్తోందనీ, అయితే మన దగ్గర ఉన్న  ఈ అద్భుతమైన సంపదను పది రూపాయల కోసం రాజకీయ నాయకులు విదేశాలకు తరలిస్తున్నారని  విమర్శించారు.  థోరియం వంటి దేశ రక్షణకు సంబంధించిన ఖనిజాలు కూడా అక్రమంగా తరలిపోతున్నాయన్నారు.ఈ దోపిడీని అరికట్టాలంటే ప్రజలలో చైతన్యం రావాలని డోలేంద్రప్రసాద్ వాస్తవ వేదిక ద్వారా పిలుపునిచ్చారు.  మంగంపేట బారైటీస్ వంటి ఖనిజాలకు లోకల్ టెండర్లు కాకుండా గ్లోబల్ టెండర్లు పిలిస్తే రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు.  రాష్ట్ర ఖనిజ సంపద ఆంధ్ర హక్కు అంటూ ప్రజాసంఘాలు నినదించాలనీ,  బాధ్యత గల ప్రతి పౌరుడూ ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమంచాలని పిలుపునిచ్చారు.  ప్రస్తుతం ఉన్న నిబంధనల వల్ల సుమారు 140 పల్వరైజింగ్ మిల్లులు మూతపడే పరిస్థితిలో ఉన్నాయని, దీనివల్ల 30 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్న డోలేంద్ర ప్రసాద్  "ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది కూటమి ప్రభుత్వమా కుమ్మక్కు ప్రభుత్వమా అని సందేహం వ్యక్తం చేశారు.   ఖనిజ దోపిడీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం  తెలుగు వన్ న్యూస్ లో వాస్తవ వేదిక ఎనిమిదో ఎడిషన్ వీక్షించండి.  

ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడానికి జగన్ పాలనా వైఫల్యాలే కారణం.. కుండ బద్దలుకొట్టిన పేర్ని

గత ఎన్నికలలో ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడానికి జగన్ పాలనా వైఫల్యాలే కారణమని మాజీ మంత్రి వైసీపీ అధినేత పేర్ని నాని కుండబద్దలు కొట్టేశారు. ఒక యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ విషయం చెప్పారు. ఇక 2029 ఎన్నికలలో విజయం కోసం జగన్ పాదయాత్రకు సిద్ధమౌతున్నారని చెప్పారు. ఔను మాజీ సీఎం  వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. 2029 ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ఆయన పాదయాత్ర @ 2.0 కు రెడీ అవుతున్నారంటూ అందుకు ముహూర్తం కూడా దాదాపుగా ఖరారైందన్నారు పేర్ని నాని.  వచ్చే ఏడాది అంటే 2027లో పార్టీ ప్లీనరీ తరువాత జగన్ తన పాదయాత్ర ప్రారంభిస్తారని   చెప్పారు. అయితే జగన్ పాలనా వైఫల్యాలు అంటూ   వైసీపీయులు కలలో కూడా అంగీకరించడానికి సాహసించని మాటలను పేర్ని నాని నోటి వెంట రావడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది.  జగన్ పాలనా వైఫల్యం కారణంగానే   2019 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని  ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని పేర్ని నాని యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించేశారు. గతంలో తమ పార్టీ అధికారంలో ఉండగా పాలనలో వైఫల్యం చెందిందన్న పేర్ని నాని, వాటి నుంచి ఏం నేర్చుకున్నాం, మరో సారి అధికారంలోకి వస్తే ఆ పాలనా వైఫల్యాలను అధిగమించి జనరంజకమైన పాలనను ఎలా అందిస్తామన్న విషయాలను మాత్రం చెప్పలేదు. అయితే వైసీపీ అధినేత  జగన్ ఇప్పటికీ తాము అద్భుత పాలన అందించామనీ, అయితే ఈవీఎంల టాంపరింగ్, చంద్రబాబు అసత్య ప్రచారాలే తమ ఓటమికి కారణమని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఇప్పుడు పేర్ని నాని పాలనా వైఫల్యం అనడంపై ఆయన ఏ విధంగా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది.  అది పక్కన పెడితే.. వైసీపీ గత అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా పరాజయం పాలై, తెలుగుదేశం కూటమి ఘన విజయంతో అధికారపగ్గాలు చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నది. ఈ ఏడాదిన్నర కాలంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పూర్తి స్థాయిలో ప్రజలలోకి వచ్చింది లేదు. అసలాయన ఆంధ్రప్రదేశ్ కు రావడమే ఏదో చుట్టపు చూపుగా వచ్చినట్లు వస్తున్నారు. వారంలో ఒక రోజు రాష్ట్రంలో ఇలా పర్యటించి అలా బెంగళూరు ప్యాలెస్ కు చెక్కేస్తున్నారు. అలా వచ్చినప్పుడు కూడా ప్రజలలోకి రావడం అత్యంత అరుదు. ఏదో అందుబాటులో ఉన్న, లేదా ఆయన ఎంపిక చేసుకున్న నేతలతో  ఇన్ హౌస్ మీటింగ్ లకు పరిమితమౌతున్నారు.   ఈ ఏదాడిన్నర కాలంలో జగన్ చేపట్టిన కార్యక్రమాలంటూ ఏవీ లేవనే చెప్పాలి. తన ప్రభుత్వ హయాంలో  అవినీతి అక్రమాలు, దౌర్జన్యాలు, కబ్జాలు, దోపిడీ ఆరోపణలతో అరెస్టైన వైసీపీ నేతలు, కార్యకర్తల అరెస్టులకు అడపాదడపా ఖండనలు, లేదా జైలు పరామర్శలకే జగన్ పరిమితమయ్యారు.  అటువంటి జగన్ ఇప్పుడు పాదయాత్ర అంటూ జనంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అన్న దానిపై పరిశీలకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.  జగన్ ఏడాది కిందటే.. అంటే 2025 జనవరిలోనే జిల్లా పర్యటనలు సహా  కార్యక్రమాలను ప్రకటించారు. తాను స్వయంగా వాటికి నేతృత్వం వహిస్తానని ప్రకటించారు. అయితే ఆయనా ప్రకటన చేసి ఏడాది గడిచిపోయినా ఆయన అడుగు బయటపెట్టింది లేదు. బెంగళూరు ప్యాలెస్ టు తాడేపల్లి ప్యాలెస్ వైస్ వెర్సా అన్నట్లుగానే ఆయన పర్యటనలు సాగాయి. దీంతో జగన్ జనంలోకి అన్న మాటను పార్టీ నేతలూ, శ్రేణులే నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని జగన్ పాదయాత్ర అంటూ చేసిన ప్రకటనను ఎవరు విశ్వసిస్తారన్న చర్చ జరుగుతోంది. ప్రకటనలే తప్ప ఆచరణ ఉండే అవకాశాలు మృగ్యమన్న వాదన వైసీపీ వర్గాల నుంచే వస్తున్నది. మరి చూడాలి జగన్ పాదయాత్రపై పేర్ని నాని ప్రకటిన ఏ మేరకు వాస్తవ రూపం దాలుస్తుందో? 

అవినీతికి పాల్పడితే తన, పర భేదం లేదు.. లోకేష్ వినూత్న విధానం

అక్రమాలు, అవకతవకలకు పాల్పడితే తన, పర తేడా లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్. ఎమ్మెల్యేలు, అధికారులపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదని హెచ్చరిస్తున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా అయిన నారా లోకేష్.. అవినీతి, అక్రమాలకు పాల్పడితే తెలుగుదేశం వారైనా, ప్రత్యర్థి పార్టీ వారైనా చర్యలు ఒకేలా ఉంటాయని విస్పష్టంగా చెబుతున్నారు. పొలిటిలక్ గా ఆయన దూకుడు ముఖ్యమంత్రి చంద్రబాబును మించి ఉందని పరిశీలకులు అంటున్నారు.  రాజకీయాల్లో నాయకులపై విమర్శలు, ఆరోపణలు సహజం.  వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అన్నది సాధారణంగా అధకారంలో ఉన్న వారిపై కంటే అధికారంలో లేని వారిపైనే ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఈ పద్ధతిని బ్రేక్ చేసి.. ఇది ప్రజాస్వామ్యం,  తన, పర తేడా లేకుండా ఎవరిపై ఆరోపణలు  వచ్చినా విచారణ జరుపుతామని,తప్పు చేశారని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెబుతున్నారు. ఇందు కోసం ఆయన ఒక కొత్త విధానాన్ని తీసుకురావడానికి రెడీ అయిపోయారు. త్వరలోనే ఆ విధానాన్ని ప్రకటించే అవకాశం ఉంది.   ముఖ్యంగా ఇక అధికారంలో ఉన్న ఎమ్మెల్యేల మీద ఫిర్యాదులు వస్తే.. వాటిని నాలుగు గోడలమధ్యా చర్చించి, హెచ్చరించో, బుజ్జగించో వదిలేయడమన్నది ఒక ఆనవాయితీగా వస్తోంది. ఆ ఆనవాయితీని బ్రేక్ చేస్తామంటున్నారు లోకేష్.    ప్రజల నుంచి ఎమ్మెల్యేలపై, వారు అధికార పార్టీ వారైనా, ప్రత్యర్థి పార్టీవారైనా సరే ఆరోపణలు వస్తే వాటిని స్వీకరించాలని లోకేష్ నిర్ణయించారు. అవినీతికి ఎవరు పాల్పడినా అది తప్పే అని కుండబద్దలు కొడుతున్నారు.  ఇక అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు నేరుగా పార్టీకే ఫిర్యాదు చేసేలా ఒక విధానాన్ని తీసుకురానున్నట్లు ఆయన చెబుతున్నారు. తమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? ఆయన పనితీరు ఎలా ఉంది?  ఆయన గానీ అనుచరులు కానీ ఏమైనా తప్పులు పొరపాట్లు చేస్తున్నారా? వంటి విషయాలను జనం నేరుగా పార్టీకే ఫిర్యాదు చేయడానికి వీలుగా తెలుగుదేశం  పార్టీ   పరంగా ప్రత్యేకమైన ఫోన్ నంబర్ ని ఏర్పాటుచేయనున్నారు.  ఆ నంబర్ కి ఫిర్యాదుదారుడు ఎవరైనా ఫోన్ చేయవచ్చు.  అలా ఫిర్యాదు చేసిన వారి ఫోన్ నంబర్లను వారి పేర్లను   గోప్యంగా ఉంచుతారు.  అంతే కాకుండా ఆ ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు కూడా తీసుకుంటారు.  ఎమ్మెల్యేలే కాదు,   అధికారుల అవినీతి మీద పనితీరు మీద కూడా ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.  ఈ విధంగా వచ్చే ఫిర్యాదులను సమగ్రంగా విచారించి, నిజానిజాల నిగ్గు తేల్చి అవసరమైతే చర్యలు తీసుకుంటారు.  ఇది దేశంలో ఎక్కడా లేని  నూతన విధానమనీ, దీనిని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారనీ తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.  దీని వల్ల అధికారులు,  ఎమ్మెల్యేలలో తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉంటుందనీ, ప్రజలు  ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉండేందుకు దోహదం చేస్తుందని భావించి లోకేష్ ఈ విధానాన్ని తీసుకురావడానికి సమాయత్తమౌతున్నారని చెబుతున్నారు.  

థాక్రే బ్రదర్స్ కలయిక ప్రభావం ఎంత?.. బీఎంసీ ఫలితాలకు ముందు సర్వత్రా ఉత్కంఠ!

బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఫలితాల వేళ సర్వత్రా ఉత్కంఠ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల ఫలితాలు నేడు  శుక్రవారం (జనవరి 16) వెలువడనున్నాయి. గురువారం (జనవరి 16) బీఎసంసీకి జరిగిన ఎన్నికలలో 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.  బీఎంసీ ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై స్పష్టమైన ప్రభావం చూపుతాయన్న అంచనాల నేపథ్యంలో ఈ ఫలిలాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  అన్నిటికీ మించి దాదాపు రెండు దశాబ్దాల తరువాత తొలి సారిగా ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రేలు ఈ ఎన్నికల కోసం చేతులు కలపడంతో బీఎంసీ ఫలితాలపై ఉత్కంఠ మరింత పెరిగింది.  ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ' ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో  ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.   బీఎంసీతో పాటుగా గురువారం (జనవరి 15) మహారాష్ట్రలో 29 కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు కూడా శుక్రవారమే (జనవరి 16) విడుదల కానున్నాయి. కాగా..  పుణె, పింప్రి-చించ్వాడ్ ప్రాంతాల్లో  మునిసిపల్ ఎన్నికలలో శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు కలిసి పోటీ చేశాయి.  జాతీయ స్థాయిలో విభేదాలు ఉన్నప్పటికీ, స్థానిక సంస్థల్లో పట్టు నిలుపుకునేందుకు 'పవార్ ఫ్యామిలీ' ఒక్కటవ్వడం కూడా రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  అన్నిటికీ మించి ఈ మునిసిపోల్స్ ను పరిశీలకులు అసెంబ్లీ ఎన్నికలకు లిట్మస్ టెస్ట్ గా అభివర్ణిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 29 కార్పొరేషన్లలోని 2,801 సీట్లకు గురువారం (జనవరి 15) పోలింగ్ జరిగింది పోలింగ్ జరిగింది.  ఒక్క బీఎంసీలోనే 227 వార్డులు ఉండగా, అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 114. 

మాజీ మంత్రి జోగు రామన్న గృహ నిర్బంధం.. ఎందుకో తెలుసా?

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జోగు రామన్నను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో జోగురామన్న అరెస్టు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం పర్యటనను అడ్డుకుంటామంటూ మాజీ మంత్రి జోగు చేసిన ప్రకటనతో అప్రమత్తమైన పోలీసులు శుక్రవారం (జనవరి 16) ఉదయమే ఆయనను హైస్ అరెస్టు చేశారు.  రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం (జనవరి 16) , నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు. వీటితోనే మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి ఆరంభం పలకనున్నారు.  ఈ నేపథ్యంలోనే సీఎం పర్యటనను అడ్డుకుంటామని జోగు రామన్న ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ఆయనను హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఆదిలాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  

రాయలసీమ లిఫ్ట్‌ను జగన్, కేసీఆర్‌కు తాకట్టు పెట్టారు : సోమిరెడ్డి

  రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో లాలూచీ పడి జగన్‌మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును తాకట్టు పెట్టేశారని ఆరోపించారు. అక్కడ తెలంగాణలో కేసీఆర్ సీఎం కాగా, ఇక్కడ ఏపీలో జగన్ సీఎం గా ఉన్న సమయంలో ఇద్దరి మధ్య విడదీయలేని అనుబంధం ఉందని వ్యాఖ్యానించారు. 2020లో తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుతో రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ స్టే విధించిందని గుర్తు చేశారు. 2020 నుంచి 2024 వరకు దాదాపు నాలుగేళ్లపాటు ఇద్దరూ సీఎంలుగా కొనసాగినప్పటికీ ఎన్జీటీ స్టే కొనసాగడమే వీరి కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. ఈ వ్యవహారాన్ని ఏపీ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎప్పుడైనా ఎన్జీటీ స్టే విధించిందా? పనులు ఆపిందా? పెనాల్టీ వేసిందా? అని ప్రశ్నించారు. లిఫ్ట్ పనులే ప్రారంభించకుండా వందల కోట్ల రూపాయలు దోచుకునేందుకు కేవలం మట్టి పనులకే పరిమితమయ్యారని విమర్శించారు. మట్టి పనుల బిల్లులు చేసుకోవడంలో ఎన్జీటీ స్టే అడ్డురాలేదని, కానీ అసలు లిఫ్ట్ నిర్మాణానికే స్టే అడ్డువచ్చినట్లుగా వ్యవహరించారని మండిపడ్డారు. ఇంత బహిరంగంగా రాయలసీమను కేసీఆర్‌కు తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి చెప్పే సినిమా కథలను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. ప్రజలంతా నిజాన్ని అర్థం చేసుకున్నారని, వైసీపీ నాయకులు నోర్లు అదుపులో పెట్టుకోవాలని సోమిరెడ్డి హెచ్చరించారు.

రాయలసీమలో ఫ్యాక్షనిజానికి కారణం...మంగంపేట గనులేనా?

  తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది. ఈ కార్యక్రమంలో మంగంపేట గనుల అంశంపై జామీన్ రైతు, ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో ప్యాక్షనిజానికి ప్రధాన మూలం మంగమ్మపేట గనులేనని ఆయన పేర్కొన్నారు. రాయలసీమ ప్రజలకు నిజంగా లాభమా, లేక సీమ పేరుతో కొద్దిమందికే లాభమా అన్న ప్రశ్నను లేవనెత్తారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మైనింగ్ వ్యాపారం చేసిన విషయం, ఆయన తండ్రి రాజారెడ్డి నేర సామ్రాజ్యం గనుల నుంచే మొదలైందని డోలేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఒక ప్రభుత్వం చేసిన తప్పులను తర్వాతి ప్రభుత్వం కాపాడుతుందని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేసిన తప్పులను వచ్చే ప్రభుత్వం రక్షించే పరిస్థితి కొనసాగుతోందని విమర్శించారు. వ్యవస్థ మొత్తం అవినీతి చక్రంలో చిక్కుకుపోయిందన్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణలో ఒక సాధారణ గుమాస్తా ఉద్యోగి వద్ద సుమారు రూ.50 కోట్లకు పైగా ఆస్తులు బయటపడటం పాలనలో ఉన్న అవినీతికి నిదర్శనమని డోలేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా సాగుతున్నవాస్తవ వేదిక గురువారం (జనవరి 15) రాత్రి 7 గంటలకు తెలుగువన్  యూట్యూబ్ చానల్ లో తప్పక వీక్షించండి.  

ద‌గ్గుపాటికి...వివాదాలు ప‌రిపాటి?

  పండ‌గ పూట నారా వారి కుటుంబ‌మంతా నారావారి ప‌ల్లెలో సంబ‌రాల్లో మునిగి తేలుతుంటే.. అనంత  ఎమ్మెల్యే వివాదం ఒక‌టి పండ‌గ స్పెష‌ల్ గా తెర‌పైకి వ‌చ్చింది. అనంత అర్బ‌న్ ఎమ్మెల్యే ద‌గ్గుపాటి ప్ర‌సాద్ రాన్రాను వివాదాస్ప‌దంగా మారుతున్నారు. తాజాగా ఆయ‌న‌పై ఒకే సారి రెండు ఆరోప‌ణ‌లు. ఒక‌టి నంబూరి వైన్స్ య‌జ‌మానిని డ‌బ్బు కోసం ప‌లు మార్లు ఫోన్లు చేసి బెదిరించ‌డం మాత్ర‌మే కాకుండా.. ఆయ‌న వైన్స్ ని కూడా త‌గ‌ల‌బెట్టించారు.  నంబూరి న‌ల‌భై ఏళ్ల నుంచి టీడీపీలో సిన్సియ‌ర్ కార్య‌క‌ర్త‌గా  కొన‌సాగుతున్నారు. త‌న‌లాంటి టీడీపీ వారి మీదే ద‌గ్గుపాటి ఇంత ప్రతాపం చూపిస్తుంటే.. ఇక సాధార‌ణ మైన వారి  ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ఆయ‌న ప్ర‌శ్నిస్తున్న విధం. ఇక ఇదే ద‌గ్గుపాటి పై రాష్ట్ర లింగాయ‌త్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ అయిన  స్వ‌ప్న అనే మ‌హిళ త‌న  భూమి క‌బ్జా చేసిన‌ట్టుగా ఆరోప‌ణ‌లు చేశారు. అనంతపురంలో ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అయితే ఆ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్దీన్ మీద ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనుచరులు దాడిచేశారని ఆరోపణలు వచ్చాయి. ఎగ్జిబిషన్ నిర్వాహకుడిని బెదిరించారంటూ సోమవారం ఆరోపణలు వచ్చాయి. అలాగే ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్ధీన్ ఈ విషయం మీద అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాం, ఎమ్మెల్యే గన్‌మెన్ షేక్షా మద్యం సేవించి ఎగ్జిబిషన్ వద్ద వీరంగం సృష్టించారని ఫిర్యాదు చేశారు. పది లక్షల రూపాయలు ఇవ్వాలంటూ తనను బెదిరించారంటూ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్ధీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ‌తంలో ద‌గ్గుపాటి మీద జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అన‌వ‌స‌రంగా  రెచ్చ‌గొట్టిన ఆరోప‌ణ‌లున్నాయి. ఆ ఆడియో కాల్ తో స‌హా బ‌య‌ట ప‌డి  నానా ర‌భ‌స కింద త‌యారైంది. లోకేష్ ఆ టైంలో హెచ్చ‌రించారు కూడా. అయినా స‌రే ద‌గ్గుపాటి కి ఇలాంటి వివాదాలు ఒక ప‌రిపాటిగా  మారింది. ఇప్ప‌టికే కొలికిపూడి వంటి ఎమ్మెల్యేల‌తో అధిష్టానానికి త‌ల బొప్పి క‌డుతోంది.  తాజాగా ద‌గ్గుపాటి  కూడా త‌యార‌య్యారు. అయితే ఇవ‌న్నీ ఆధారాలుండి బ‌య‌ట ప‌డ్డ ఎమ్మెల్యే బాగోతాల‌నీ. ఇదే రాయ‌ల‌సీమ‌లో ఒక కూట‌మి  ఎంపీని కూట‌మి  ఎమ్మెల్యే లంచం డిమాండ్ చేసిన విధం రాష్ట్ర‌మంతా పాకింది. వీరే  కాదు.. మొత్తం 48 మంది ఎమ్మెల్యేల‌ను సాక్షాత్ చంద్ర‌బాబే పిలిచి వార్నింగిచ్చారు. ప‌ద్ధ‌తి మార్చుకోకుంటే క‌ష్ట‌మేన‌ని తేల్చి చెప్పారు. ఇలాంటి అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న వారు సుమారు 70 మంది వ‌ర‌కూ ఉన్న‌ట్టు కొన్ని అంచ‌నాలున్నాయి. కాబ‌ట్టి.. అధినేత చంద్ర‌బాబు వీరంద‌రిపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీస్కోకుంటే క‌ష్ట‌మేన‌ని తెలుస్తోంది.

ఈటల వర్సెస్ మర్రి.. తెలంగాణలోనూ క్రెడిట్ వార్

ఆంధ్రప్రదేశ్ లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్యం విషయంలో తెలుగుదేశం, వైసీపీల మధ్య ఒక పక్క క్రెడిట్ వార్ కొనసాగుతుండగానే.. తెలంగాణలో కూడా మరో క్రెడిట్ వార్ మొదలైంది. పొలిటికల్ గా క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవడానికి నేతల ఆరాటమే ఇందుకు కారణం. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అయితే అడ్డగోలుగా తాను అవసరం లేదంటూ వాదించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో ఆ ఎయిర్ పోర్టు ఘనతను తన ఖాతాలో వేసుకోవడానికి పడుతున్న తాపతయం నవ్వుల పాలౌతోంది. అది పక్కన పెడితే.. తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది. సదరు బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య వాగ్వాదం తీవ్ర రూపం దాల్చి బాహాబాహీదాకా వెళ్లింది. ఇదే విషయంలో ఈటల, మర్రి రాజశేఖరరెడ్డిల మధ్య వాగ్వాదం కూడా ముదిరింది. పోలీసులు సకాలంలో జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందనుకోండి అది వేరే సంగతి.  విషయమేంటంటే మేడ్చల్ జిల్లా మచ్చబొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జి పనుల కు శంకుస్థాపన కార్యక్రమంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తన ఘనత అంటే తన ఘనత అంటూ ఈటల, మర్రి వాదనకు దిగారు. దీంతో శంకుస్థాపన సందర్భంగా బీజీపీ, బీఆర్ఎస్ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.   పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగినా.. మాటల యుద్ధం మాత్రం ఇంకా కొనసాగుతోంది. చూడాలి మరి ఈ క్రెడిట్ వార్ లో విజయం ఎవరిదో?

స్కిల్ కేసు కొట్టివేత

సోమవారం ఉదయం, పోలవరం-నల్లమల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను భారత సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని, రాష్ట్ర ప్రభుత్వ చట్టపరమైన విధానానికి ఎదురుదెబ్బ తగిలిందని కోర్టు పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ కవిత Xలో పోస్ట్ ద్వారా ఈ పరిణామంపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌తో కృష్ణా, గోదావరి జల వివాదాలను పరిష్కరించడంలో పాలక ముఖ్యమంత్రి మరోసారి తన అసమర్థతను చూపించారని ఆమె అన్నారు. నీటి హక్కులపై పొరుగు రాష్ట్రాలతో పోరాడకూడదని బహిరంగంగా చెప్పిన ముఖ్యమంత్రి ఉండటం తెలంగాణకు దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. కోర్టు ఫలితం తెలంగాణకు మరో అడ్డంకిని జోడించిందని కవిత పేర్కొన్నారు. రిట్ పిటిషన్ దాఖలు చేయడం వల్ల పోలవరం-నల్లమల సాగర్ లిఫ్ట్ ప్రాజెక్ట్ అక్రమ నిర్మాణంపై తెలంగాణ హక్కులు బలహీనపడ్డాయి. ఈ చర్య రాష్ట్రాన్ని రక్షించడానికి బదులుగా రాష్ట్ర స్థానాన్ని దెబ్బతీసిందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మరియు కొంతమంది కీలక ప్రభుత్వ సభ్యులు తీసుకున్న నిర్ణయాల కారణంగా తెలంగాణ ప్రజల నీటి హక్కులు నిరాకరించబడుతున్నాయని కవిత ఆరోపించారు. ఆ హక్కులను కాపాడుకోవడానికి తెలంగాణ జాగృతి ఏపీ నీటి ప్రాజెక్టులపై పోరాడుతుందని ఆమె నొక్కి చెప్పారు.