ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీగా కృష్ణపట్నం: అరుణ్‌జైట్లీ
posted on Jul 10, 2014 @ 1:45PM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు.
ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఇప్పటి వరకు ప్రకటించిన వరాలు:
1.ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పనున్న ఎయిమ్స్‌కు కేంద్ర బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించారు.
2.విశాఖ - చెన్నయ్ మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు.
3. ఆంధ్రప్రదేశ్‌లో ఐఐటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
4. తెలంగాణ రాష్ట్రంలో రూ.200 కోట్లతో ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు.
5. అనంతపురం జిల్లా హిందూపురంలో నేషనల్ ఆబ్కారీ అండ్ కస్టమ్స్ అకాడమీ ఏర్పాటు.
6. ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీగా కృష్ణపట్నం.
7. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో హార్డ్‌వేర్ ఉత్పత్తి రంగం అభివృద్ధికి కృషి.