లైవ్ బడ్జెట్ 2014-15: ముఖ్యాంశాలు
posted on Jul 10, 2014 @ 12:06PM
గురువారం లోక్‌సభలో సాధారణ బడ్జెట్‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. అందులోని ముఖ్యాంశాల వివరాలు:
# ఈ బడ్జెట్ మనం ఆశించే ఆర్థికస్థితికి మొదటి అడుగు మాత్రమే
# పేదరిక నిర్మూలనపై ఎక్కువ దృష్టి
# నిరుద్యోగంతో ఇంకా తల్లడిల్లాలని ఈ దేశం అనుకోవట్లేదు.
# తయారీ, మౌలిక సదుపాయాల రంగాలను వృద్ధిబాట పట్టించాలి.
# దేశంలో మార్పునకు ప్రజలు ఓటేశారు.
# అవసరాలకు భిన్నంగా వ్యయం చేయలేను.
# స్థూల జాతీయోత్పత్తి ఇంకా పెరగాలి.
# వ్యయ నిర్వహణ సంస్థను కేంద్రం నియమిస్తుంది.
# వస్తు సేవల పన్నుపై చర్చకు ముగింపు పలకాలి.
# పెట్టుబడులకు స్నేహపూర్వక పన్నుల విధానం.
# ఆర్థిక వ్యవస్థకు నల్లధనం ప్రమాదకారిగా మారింది.
# రాబోయే 3, 4 ఏళ్లలో 7 నుంచి 8 శాతం వద్ధిని ఆశిస్తున్నాం.
#దారిద్య్రరేఖ నుంచి బయటకు రావడానికి పేదలు ఎదురుచూస్తున్నారు.
#నిర్ణయాల జాప్యం వల్ల అవకాశాలు కోల్పోయాం.
# రానున్న కాలంలో ద్రవ్యోల్బణం తగ్గుతుందని ఆశిస్తున్నాం.
# ఈ బడ్జెట్ సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో రూపొందింది.
# ఈ బడ్జెట్ నుంచి అతిగా ఆశించొద్దు.
# పన్నుల వివాదాల వేగవంత పరిష్కారం దిశగా ట్రైబ్యునల్స్.
# నైపుణ్యాల పెంపునకు స్కిల్ ఇండియా కార్యక్రమం.
# 9 విమానాశ్రయాల్లో ఈ విసా సదుపాయం.
# బ్యాంకింగ్ వ్యవస్థకు మరింత స్వేచ్ఛ, జవాబుదారీతనం పెంపు.
# బీమా రంగంలో ఎఫ్‌డీఐలు 26 శాతం నుంచి 49 శాతంకు పెంపు.
# రక్షణ రంగంలోనూ ఎఫ్‌డీఐలు 26 శాతం నుంచి 49 శాతంకు పెంపు.
# ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి నిలకడైన నిర్ణయాలే పునాది.
# తయారి మౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి రూ. 2.4 లక్షల కోట్లు.
# తక్కువ వ్యయంతో గహ నిర్మాణం, ఎఫ్‌డీఐలకు ప్రోత్సాహం.
#బ్యాంకింగ్ వ్యవస్థకు మరింత స్వేచ్ఛ, జవాబుదారీతనం పెంపు.
#గుజరాత్ ప్రభుత్వం తలపెట్టిన సర్థార్ పటేల్ ప్రతిమకు రూ. 200 కోట్లు.
# నీటిపారుదల రంగంలో ప్రధానమంత్రి కృషీ సిచియాన్ యోజన.
# 2019 నాటికి పరిశుభ్ర భారత్.
# దేశంలోని అన్ని నివాసాలకు 24 గంటలూ విద్యుత్ ఇవ్వాలనే లక్ష్యం.
# ఎస్సీల అభివృద్ధికి 50,548 కోట్లు కేటాయింపు.
# ఏకీకత ప్రావిడంట్ ఫండ్ విధానం కోసం ఈపీఎఫ్‌ఓ ప్రారంభం.
# గ్రామీణ విద్యుదీకరణకు రూ. 500 కోట్లు.
# ఎంపిక చేసిన రంగాల్లోనే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు.
# దళిత, గిరిజన, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక పథకాలు.
# అంధులకు అర్థమయ్యేలా బ్రెయిలీ కరెన్సీ నోట్లు ప్రచురణ.
# మహిళల భద్రత కోసం రూ. 150 కోట్లు.
# త్వరలో ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్.
# ఉపాధి హామి పథకాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతాం.
# లింగవివక్షకు వ్యతిరేకంగా పాఠశాలల్లో బోధనలో మార్పులు.
# ఆడపిల్లలను రక్షించండి, చదివించండి పథకానికి రూ. 500 కోట్లు